Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ - ఇంగ్లండ్ వన్డే సిరీస్ : కోల్‌కతాలోని ఈడెన్‌లో పరుగుల వరద పారేనా?

భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య వన్డే క్రికెట్ సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన రెండు వన్డేలలో భారత్ విజయం సాధించింది. మరోవైవు ఈ సిరీస్‌లో మూడో వన్డే మ్యాచ్ ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డె

Webdunia
శనివారం, 21 జనవరి 2017 (19:48 IST)
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య వన్డే క్రికెట్ సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన రెండు వన్డేలలో భారత్ విజయం సాధించింది. మరోవైవు ఈ సిరీస్‌లో మూడో వన్డే మ్యాచ్ ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్‌లో జరుగనుంది. ఇక్కడ కూడా పరుగుల వరద పారే అవకాశం ఉంది. 
 
గత రెండు మ్యాచ్‌ల్లో ఇరు జట్లు 350 పైచిలుకు పరుగులు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం జరగబోయే చివరి వన్డేలోనూ పరుగుల వరద పారే అవకాశాలున్నాయి. ఈ స్టేడియంలో జరిగిన చివరి వన్డేలో భారత్ 400 పైచిలుకు పరుగులు చేసింది. ఇక్కడ చివరి సారిగా 2014లో భారత్-శ్రీలంక మధ్య వన్డే మ్యాచ్ జరిగింది. 
 
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 404 పరుగులు చేసింది. ఇందులో రోహిత్ శర్మ ఒక్కడే 264 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో భారత్ 153 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ప్రస్తుత జట్లలోని ఆటగాళ్లు మంచి ఫామ్‌లో ఉండటం, 50 ఓవర్ల క్రికెట్లో పలు మార్పులు జరగడంతో బౌలర్లపై మరోసారి ప్రతికూల ప్రభావం అవకాశం ఉంది.
 
అందులోనూ ఈడెన్ పిచ్ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉండడంతో అభిమానులు పరిమిత ఓవర్ల మజాను పొందే చాన్స్ ఉంది. ఇప్పటివరకూ ఈ స్టేడియంలో భారత్ 20 వన్డేలు ఆడగా, అందులో 11 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. ఈ వేదికపై భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఇక్కడ రెండు వన్డేలు జరగగా, ఆ రెండింటిలోనూ భారత జట్టే విజేతగా నిలిచింది. 

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోరు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

తర్వాతి కథనం
Show comments