కరోనాను లెక్క చేయని టీమిండియా.. ఆస్ట్రేలియాతో క్రికెట్ సిరీస్‌కు సిద్ధం..?

Webdunia
శుక్రవారం, 23 అక్టోబరు 2020 (10:54 IST)
India Austrlia tour
కరోనా వైరస్ కారణంగా విదేశీ గడ్డపై క్రికెట్ ఆడేందుకు ప్రపంచ క్రికెట్ జట్లు జడుసుకున్నాయి. కానీ ఐపీఎల్ క్రికెట్ టోర్నీ దుబాయ్‌లో జరుగుతున్న నేపథ్యంలో.. ఇదే తరహాలో క్రికెట్ సిరీస్‌లు నిర్వహించాలని ఐసీసీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత జట్టుకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఆసీస్ పర్యటనకు వెళ్లే జట్టుకు భారత ప్రభుత్వం నుంచి అనుమతి లభించినట్లుగా తెలుస్తోంది. 
 
ప్రారంభ మ్యాచ్‌లు సిడ్నీ, కాన్‌బెర్రాలో జరగనుండగా వచ్చే నెలలో టీమిండియా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టనుందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆస్ట్రేలియా, న్యూ సౌత్ వేల్స్ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా భారత జట్టుకు సంబంధించిన అతిథ్య ఏర్పాట్లను సమీక్షిస్తోంది. 
 
క్వారెంటైన్, శిక్షణా సదుపాయాలకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించనున్నాయి. ఈ పర్యటనలో భాగంగా మెుదటి వన్డే సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యం ఇవ్వనుంది. నవంబర్ 27న ఈ మ్యాచ్ జరగనుంది. టెస్ట్ సిరీస్‌ పింక్ బాల్‌లో ఆడనున్నారు. డిసెంబర్ 17-21 మధ్య అడిలైడ్ ఓవల్‌లో వేదికగా మెుదటి టెస్ట్ జరాగాల్సి ఉంది. కోవిడ్ పరిమితుల దృష్ట్యా వేదికను మార్చే అవకాశం కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ChandraBabu: నాలుగు గంటలే నిద్రపోయే ఏపీ సీఎం చంద్రబాబు.. ఫాలో అవుతున్న నారా లోకేష్

నవంబర్ 8న నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభం

2027 Jagan Padayatra: 2027లో జగన్ కొత్త పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారా?

Lizard: వరదరాజ పెరుమాళ్ ఆలయంలో బంగారు, వెండి ప్రతిమలు మాయం (video)

Rayalacheruvu-శ్రీకాళహస్తిలో భారీ వర్షాలు.. రాయలచెరువులో పంటలు మునక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kajal Aggarwal: ఆస్ట్రేలియాలో భర్తతో టాలీవుడ్ చందమామ.. ఫోటోలు వైరల్

Dil Raju: లివ్ ఇన్ రిలేషన్.. కానీ పిల్లలు పుట్టడమే సమస్య : దిల్ రాజు

ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో ప్రీమియర్లకి అద్భుతమైన స్పందన : తిరువీర్

Vishwak Sen.: విశ్వక్ సేన్.. ఫంకీ థియేటర్ డేట్ ఫిక్స్

Pre-Wedding Show Review: హాయిగా నవ్వుకునేలా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో.. మూవీ రివ్యూ

తర్వాతి కథనం
Show comments