ఇద్దరు ఒకే అమ్మాయి కోసం పరుగెడుతారు..

Webdunia
మంగళవారం, 6 నవంబరు 2018 (11:49 IST)
ఈడెన్ గార్డెన్‌లో ఆదివారం జరిగిన తొలి ట్వంటీ-20 మ్యాచ్‌లో ఆతిథ్య భారత్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలుత బౌలర్లు చెలరేగడంతో వెస్టిండీస్‌ను నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 109 పరుగులకే కట్టడి చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా లక్ష్యం చిన్నదే అయినప్పటికీ ఛేదనలో ఆదిలో కొంచెం తడబడింది. ఆ తర్వాత కార్తీక్, కృనాల్‌లు రాణించడంతో రోహిత్ సేన సునాయాసంగా గెలిచింది. 
 
ఇక ఈ మ్యాచ్ గెలుపోటములు అటుంచితే… విండీస్ క్రికెటర్లు చేసిన ఓ పని ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ నవ్వులు పూయిస్తోంది. అసలేం జరిగిందంటే… ఇన్నింగ్స్‌లో బుమ్రా వేసిన నాల్గో ఓవర్‌లో కరేబియన్ ఆటగాళ్లు హెట్‌మైర్‌, హోప్ తడబడి రనౌట్ రూపంలో వికెట్ పారేసుకున్నారు. హెట్‌మైర్‌తో కోఆర్డినేషన్ సరిగా లేకపోవడంతో  షై హోప్‌ రనౌటయ్యాడు.
 
ఈ రనౌట్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. డ్యూట్ ఇది క్రికెట్ బాస్.. రన్నింగ్ రేస్ కాదూ, ఎందుకు ఇద్దరు ఒకే అమ్మాయి కోసం పరుగెడుతారు, బీజేపీ అండ్ కాంగ్రెస్ రేస్, హెట్‌మైర్‌ విన్ ది రేస్ అంటూ ఛలోక్తులు విసురుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

9 డాలర్లు అంటే రూ.72 వేలా? ఇదేం లెక్క జగన్? ట్రోల్స్ స్టార్ట్

ప్రేమించిన వ్యక్తి మృతి చెందాడనీ మనస్తాపంతో ప్రియురాలు ఆత్మహత్య

Putin: ఢిల్లీలో ల్యాండ్ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్, స్వాగతం పలికిన ప్రధాని మోడి

Work From Village Policy: దేశంలోనే ఇది మొదటిసారి: బాబు, లోకేష్ సూపర్ ప్లాన్

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 18 మంది మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

తర్వాతి కథనం
Show comments