Webdunia - Bharat's app for daily news and videos

Install App

కివీస్ - బంగ్లాదేశ్ పర్యటనలకు భారత్ జట్టు ఎంపిక

Webdunia
సోమవారం, 31 అక్టోబరు 2022 (19:26 IST)
న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లతో భారత్ క్రికెట్ సిరీస్ ఆడనుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా వేదికగా ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీ జరుగుతోంది. ఈ టోర్నీ ముగిసిన తర్వాత భారత్ తొలుత న్యూజిలాండ్ జట్టుతో టీ20, వన్డే సిరీస్ ఆడుతుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లో తలపడుతుంది. 
 
అయితే, న్యూజిలాండ్‌తో జరిగే క్రికెట్ సిరీస్‌ కోసం సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రాహుల్, రోహిత్ శర్మలకు విశ్రాంతి నిచ్చారు. బంగ్లాదేశ్ జట్టుతో జరిగే క్రికెట్ సిరీస్ కోసం వెన్ను నొప్పితో బాధపడుతూ తిరిగి కోలుకుంటున్న రవీంద్ర జడేజా మళ్లీ జట్టులోకి రానున్నారు. ఈ సిరీస్‌ల కోసం ప్రకటించిన జట్ల వివరాలను పరిశీలిస్తే, 
 
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ : హార్దిక్ పాండ్యా (కెప్టెన్), పంత్ (వైస్ కెప్టెన్), గిల్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, యజువేంద్ర, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్, మొహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్.
 
కివీస్‌తో వన్డే జట్టు : ధావన్ (కెప్టెన్), పంత్ (వైస్ కెప్టెన్), గిల్, హుడా, సూర్యకుమార్, శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్, సుందర్, శార్దూల్ ఠాకూర్, షాబాజ్ అహ్మద్, యజువేంద్ర, కుల్దీప్ యాదవ్, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్. 
 
బంగ్లాదేశ్‌తో వన్డే జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైఎస్ కెప్టెన్), ధావన్, కోహ్లీ, రజత్ పటీదార్, శ్రేయాస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, సుందర్, శార్దూల్ ఠాకూర్, మొహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, దీపక్ చావర్, యధ్ దయాల్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

తర్వాతి కథనం
Show comments