Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియాకు కోచ్‌ని సెప్టెంబరులో నియమిస్తాం: అనురాగ్ ఠాకూర్

Webdunia
మంగళవారం, 28 జులై 2015 (16:04 IST)
దక్షిణాఫ్రికా సిరీస్‌కు ముందు ఫుల్ టైమ్ కోచ్‌ను ఎంపిక చేస్తామని బీసీసీఐ బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. సెప్టెంబరులో కోచ్ ఎంపిక మాత్రమే గాకుండా.. ఇతర సిబ్బంది ఎంపిక కూడా అప్పుడే ఉంటుందని అనురాగ్ ఠాగూర్ వివరించారు. అలాగే మాస్టర్ బ్లాస్టర్ సచిన్, గంగూలీ, లక్ష్మణ్‌లతో కూడిన త్రిసభ్య కమిటీ సూచనల మేరకు కోచ్‌ను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. తద్వారా డంకన్ ఫ్లెచర్ తప్పుకున్నాక టీమిండియా కోచ్ ఎంపికకు మరో రెండు నెలల సమయం పట్టవచ్చునని తెలుస్తోంది. 
 
అంతవరకు టీమ్ డైరక్టర్ రవిశాస్త్రికి అదనపు బాధ్యతలను బీసీసీఐ అప్పగించింది. తాజాగా శ్రీలంకతో జరుగనున్న క్రికెట్ సిరీస్‌లో రవిశాస్త్రినే అంతా తానై జట్టును నడిపిస్తాడని సమాచారం. మరోవైపు ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్లబ్ నుంచి నిషేధానికి గురైన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై తగిన చర్యలకు చర్చలు జరుపుతున్నామన్నారు. 

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

తెలంగాణలో వర్షాలు.. అంటువ్యాధులతో జాగ్రత్త.. సూచనలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

Show comments