Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరాతిలో దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం!

ఠాగూర్
ఆదివారం, 26 జనవరి 2025 (14:50 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతి క్రీడా నగరంలో దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని నిర్మించనున్నారు. మొత్తం 60 ఎకరాల విస్తీర్ణంలో రూ.800 కోట్ల వ్యయంతో ఈ స్టేడియం నిర్మాణం చేపట్టనున్నారు. ఈ విషయాన్ని ఆంధ్రా క్రికెట్ అసో సియేషన్ (ఏసీఏ) అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు. దీనిపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ భారీ స్టేడియం నిర్మాణం కోసం 60 ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరామని చెప్పారు. 
 
దేశంలో ఇప్పటివరకూ అతి పెద్ద క్రికెట్ స్టేడియం ఒక 1.10 లక్షల నీటింగ్ సామర్థ్యంతో అహ్మదాబాద్ నగరంలో ఉంది. దానికి మించి 125 లక్షల వీక్షకులు కూర్చునేలా కొత్త స్టేడియం నిర్మించాలని భావిస్తున్నాం. బీసీసీఐ నుంచి దీనికి ఆర్థిక సాయం తీసుకోవాలని నిర్ణయించాం. కొంత స్థానికంగా మేము సమీకరిస్తాం. అమరావతిలో రెండు వందల ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీని నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. అందులోనే ఈ స్టేడియం వస్తుంది అని ఆయన చెప్పారు. 
 
ఇక అమరావతిలో 2029 జాతీయ క్రీడలు నిర్వహించడానికి బిడ్ వేయనున్నట్లు శివనాథ్ తెలిపారు. క్రికెట్ కోసం ప్రత్యేకంగా మూడు అకాడమీలు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఉత్తరాంధ్ర, విజయవాడ, రాయలసీమలో ఈ అకాడమీలు ఏర్పాటు అవుతాయని చెప్పారు. వీటి నిర్వహణకు మిథాలీ రాజ్, రాబిన్ సింగ్‌ను తీసుకుంటున్నామని, వారి ఆధ్వర్యంలో క్రికెట్ శిక్షణ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. వచ్చే రెండేళ్లలో ఐపీఎల్‌కు ఆంధ్రప్రదేశ్ నుంచి కనీసం 16 మంది ఎంపిక కావాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రజల ఆకాంక్షను నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం : గవర్నర్ అబ్దుల్ నజీర్

రిపబ్లిక్డే పరేడ్.. ప్రత్యేక ఆకర్షణంగా ఏటికొప్పాక బొమ్మల శకటం

హస్తిలో ఘనంగా 76వ గణతంత్ర వేడుకలు.. జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి

బాలికను నగ్న వీడియో తీసి... తల్లిని శారీరకంగా లోబరుచుకున్న కామాంధుడు...

విమానంలో వీరకుమ్ముడు... వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నటనతో దశాబ్దంపాటు తెలుగు వారిని ఆలరించారు శోభన!

రీల్ హీరోనే కాదు.. నిజ జీవితంలోనూ రియల్ హీరో!!

జోరు తగ్గని సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్లు : రూ.300 కోట్ల దిశగా పరుగులు!!

Trisha : త్రిష సంచలనం నిర్ణయం.. సినిమాలను పక్కనబెట్టి విజయ్‌తో పొలిటికల్ జర్నీ?

టికెట్ రేట్లు పెంచడంకంటే కంటెంట్ చిత్రాలు తీయండి : కోమటిరెడ్డి వెంకటరెడ్డి

తర్వాతి కథనం
Show comments