Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపియర్ వన్డే : న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన భారత్

Webdunia
బుధవారం, 23 జనవరి 2019 (15:11 IST)
నేపియర్ వన్డేలో భారత్ శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ జట్టును ఓడించింది. ఈ మ్యాచ్‍లో కివీస్ జట్టు విధించిన 157 పరుగుల సునాయాస లక్ష్యాన్ని భారత ఆటగాళ్లు ఆడుతూపాడుతూ ఛేదించారు. డక్‌వర్త్ లూయిస్ పద్దతి మేరకు 85 బంతులు మిగిలివుండగానే 8 వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన కివీస్ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. భారత బౌలర్ల ధాటికి ఈ జట్టు కేవలం 38 ఓవర్లలో 157 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత 158 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఓపెనర్లు మంచి ప్రారంభాన్ని ఇచ్చారు. రోహిత్ శర్మ తన వ్యక్తిగత స్కోరు 11 పరుగులు, విరాట్ కోహ్లీ 45 పరుగుల వద్ద ఔటైనప్పటికీ... మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (75 నాటౌట్), అంబటి రాయుడు (11 నాటౌట్)లు కలిసి జట్టును విజయతీరాలకు చేర్చారు. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది. 
 
అంతకుముందు కివీస్ ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు జూలు విదిల్చారు. కట్టుదిట్టమైన బౌలింగ్‌ దెబ్బకు ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు కేవలం 157 పరుగులకే ఆలౌట్ అయింది. కీవీస్ జట్టును తక్కువ స్కోరుకు ఆలౌట్ చేయడంలో బౌలర్లు ప్రధానపాత్ర పోషించారు. ముఖ్యంగా, కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీయగా, మహమ్మద్ షమీ కీలకమైన మూడు వికెట్లు, చాహాల్ 2, జాదవ్‌ ఒక వికెట్ చొప్పున తీశాడు. ఫలితంగా కివీస్ జట్టు 157 పరుగులకే ఆలౌట్ అయింది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ జట్టును ఆరంభంలోనే షమీ దెబ్బతీశాడు. కివీస్ సారథి కేన్ విలియమ్సన్ (64) ఒక్కడే ర్థశతకంతో రాణించగా, రాస్ టేలర్ (24) పరుగులు చేశాడు. స్టార్ ప్లేయర్స్ మార్టిన్ గుప్తిల్ (5), మున్రో (8), టామ్ లాథమ్ (11), హెన్రీ నికోల్స్ (12) నిరాశపరిచారు. 
 
పైగా, సొంత గడ్డపై గొప్ప రికార్డు కలిగిన బ్యాట్స్‌మెన్ చేతులెత్తేయడంతో కివీస్ జట్టు కేవలం 38 ఓవర్లలోనే 157 పరుగులకే ఆలౌట్ అయింది. నిజానికి 145 పరుగుల వద్ద 6 వికెట్లతో ఉన్న జట్టు మరో 12 పరుగులు జోడించేలోపే చివరి నాలుగు వికెట్లనూ కోల్పోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Salary Cut : జగన్మోహన్ రెడ్డి జీతంలో కోత లేదా సస్పెన్షన్ తప్పదా?

Teenmaar Mallanna: కొత్త పార్టీని ప్రారంభించిన తీన్మార్ మల్లన్న

ప్రతి ఒక్కరూ చక్కెర - ఉప్పు - నూనె తగ్గించుకోండి.. సీఎం చంద్రబాబు సూచన

ఫేక్ ప్రచారం.. వైకాపా నేత భూమనకు పోలీసుల నోటీసు

శబరిమల అభివృద్ధికి రూ.70.37 కోట్లు ఖర్చు చేశాం-వాసవన్ ప్రకటన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సింజిత్.. ఫోన్ ఆఫ్ చేసి ఎక్కడికీ వెళ్లకు బ్రదర్... మహేశ్

Atharva Murali: అథర్వ మురళీ యాక్షన్ థ్రిల్లర్ టన్నెల్ రాబోతోంది

ఐదు రూపాయల కాయిన్ ఎందుకు బ్యాన్ అయింది అనే కథతో చంద్రహాస్ కాయిన్ చిత్రం

Manoj: మా అమ్మ, అక్క కళ్ళల్లో ఆనందం చూశాను : మంచు మనోజ్

Vijay: టాలెంట్ ఉందోలేదో తెలీదు, ఆ డైరెక్టర్ తో వంద దేవుళ్ళు చేస్తున్నా : విజయ్ ఆంటోనీ

తర్వాతి కథనం
Show comments