32 యేళ్ల తర్వాత భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్!!

వరుణ్
మంగళవారం, 26 మార్చి 2024 (08:37 IST)
భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య 32 యేళ్ల తర్వాత ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరుగనుంది. ఈ యేడాది ఆఖరులో ఈ సిరీస్ జరుగనుంది. ఇందుకోసం ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. నిజానికి ఈ పర్యటనలో ఐసీసీ షెడ్యూల్ ప్రకారం ఆస్ట్రేలియా నాలుగు టెస్టులు మ్యాచ్‌లు మాత్రమే ఆడాల్సివుంది. అయితే, క్రికెట్ ఆస్ట్రేలియా మరో టెస్ట్ మ్యాచ్‌ను అదనంగా చేర్చి, మొత్తం ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ కోసం షెడ్యూల్‌ను ఖరారు చేసింది. దీంతో ఇరు జట్ల మధ్య 32 యేళ్ల తర్వాత ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరుగనుంది. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ప్రకటన విడుదల చేసింది. 
 
కాగా, భారత్ ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య చివరిసారిగా గత 1991-92లో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరిగింది. మళ్లీ 32 యేళ్ల తర్వాత ఇరు జట్ల మధ్య టెస్ట్ సిరీస్ నిర్వహిస్తున్నారు. ఈ యేడాది నవంబరులో భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ ప్రారంభంకానుంది. దీనికి అదనంగా మరో టెస్ట్ మ్యాచ్‌ను జోడించారు. త్వరలోనే తాజా షెడ్యూల్‌ను రిలీజ్ చేస్తామని ప్రకటించారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఇప్పటివరకు నాలుగు పర్యాయాలు నిర్వహించగా, అన్నింటిలోనూ టీమిండియానే విజేతగా నిలవడం గమనార్హం. వీటిలో రెండు సిరీస్‌లలో ఆస్ట్రేలియా జట్టును వారి సొంతగడ్డపైనే ఓడించి విజేతగా నిలిచింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మిస్టర్ నాయుడు 75 యేళ్ల యంగ్ డైనమిక్ లీడర్ - 3 కారణాలతో పెట్టుబడులు పెట్టొచ్చు.. నారా లోకేశ్

ఇదే మీకు లాస్ట్ దీపావళి.. వైకాపా నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్... (Video)

రాజకీయాలు చేయడం మానుకుని సమస్యలు పరిష్కరించండి : హర్ష్ గోయెంకా

ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుందా? కేంద్ర మంత్రి కుమారస్వామి కామెంట్స్

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఇండియా కూటమిలో చీలిక - ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

చిరంజీవి నివాసంలో మెగా దీపావళి వేడుకలు.. అతిథిలు వీరే

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

తర్వాతి కథనం
Show comments