శ్రీలంకపై 82 పరుగుల తేడాతో టీమిండియా భారీ విజయం

సెల్వి
గురువారం, 10 అక్టోబరు 2024 (08:21 IST)
Team India
మహిళల టీ20 ప్రపంచకప్‌ 2024లో తప్పకగెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక ఆస్ట్రేలియాతో జరగనున్న ఆఖరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధిస్తే గ్రూప్-ఏ నుంచి సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.
 
ఈ నేపథ్యంలో బుధవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. డూ ఆర్‌ డై మ్యాచ్‌లో టీమిండియా 82 పరుగుల భారీ తేడాతో విజయం సాధించడంతో పాటు, టీమిండియా రన్‌రేట్‌ (0.560) కూడా పెరిగింది. 
 
దుబాయ్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన (38 బంతుల్లో 50; 4 ఫోర్లు, 1 సిక్స్), షెఫాలి వర్మ (40 బంతుల్లో 43; 4 ఫోర్లు) ఆకట్టుకున్నారు. 
 
అనంతరం 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగన శ్రీలంక ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. 19.5 ఓవర్లలో 90 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా 82 పరుగులతో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. 
 
భారత మహిళా బౌలర్ల విషయానికొస్తే.. అరుంధతి రెడ్డి, ఆషా శోభాన తలో మూడు వికెట్లు పడగొట్టగా, రేనుకా ఠాకూర్ సింగ్ 2 వికెట్లు తీసింది. ఇక శ్రేయాంక పాటిల్, దీప్తి శర్మ తలో వికెట్​ వికెట్ పడగొట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Dog To Parliament: కారులో కుక్కను పార్లమెంట్‌కు తీసుకొచ్చిన రేణుకా చౌదరి.. తర్వాత?

నేను నా స్నేహితుడు అలా ఆలోచిస్తున్నాం.. చంద్రబాబు

Vizag: కైలాసగిరి కొండలపై కాంటిలివర్ గాజు వంతెన ప్రారంభం

ఐదేళ్ల చిన్నారిపై పాశవికంగా దాడి చేసిన ఆయా

మహిళా వ్యాపారవేత్తను తుపాకీతో బెదిరించి, దుస్తులు విప్పించి లైంగిక వేధింపులు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

తర్వాతి కథనం
Show comments