Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోతేరా టెస్టులో ఇంగ్లండ్ 205 రన్స్‌కు ఆలౌట్

Webdunia
గురువారం, 4 మార్చి 2021 (17:49 IST)
అహ్మదాబాద్‌లోని మోతేరా క్రికెట్ స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య చివరిదైన నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన పర్యాటక ఇంగ్లండ్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 205 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ  తర్వాత బ్యాటింగ్ చేపట్టిన భారత్.. వికెట్ నష్టానికి 24 పరుగులు చేసింది. దీంతో తొలి రోజు ఆట ముగిసింది. యువ ఓపెనర్ శుభ్ మాన్ గిల్ ఖాతా ఆరంభించకుండానే ఇంగ్లండ్ పేసర్ ఆండర్సన్ బౌలింగులో ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయ్యాడు.
 
అంతకుముందు.. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో స్పిన్ ఫ్రెండ్లీ పిచ్‌లపై తన తడబడి 205 పరుగులకు ఆలౌట్ అయింది. మూడో టెస్టుతో పోల్చితే కాస్త మెరుగ్గా ఆడిన ఇంగ్లండ్ టాస్ గెలిచిన ఆధిక్యతను మాత్రం నిలుపుకోలేకపోయింది. తొలిరోజు చివరి సెషన్ ముగియకముందే వికెట్లన్నీ కోల్పోయింది.
 
టీమిండియా స్పిన్నర్లు అక్షర్ పటేల్ (4/68), అశ్విన్ (3/47), సుందర్ (1/14) మరోసారి బంతిని గింగిరాలు తిప్పగా, హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ (2/45) కీలక వికెట్లు తీసి సత్తా చాటాడు. ఇంగ్లండ్ కెప్టెన్ రూట్ (5), జానీ బెయిర్ స్టో (28)లను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని భారత శిబిరంలో ఉత్సాహం నింపాడు.
 
55 పరుగులు చేసిన బెన్ స్టోక్స్ ఇంగ్లండ్ జట్టులో టాప్ స్కోరర్ గా నిలిచాడు. డాన్ లారెన్స్ 46 పరుగులు, ఓల్లీ పోప్ 29 పరుగులతో రాణించారు. అయితే వీరు టీమిండియా స్పిన్ ఉచ్చులో చిక్కుకుని పెవిలియన్ చేరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సింగపూర్‌లో తెలుగును రెండో అధికార భాషగా గుర్తించాలి : సీఎం చంద్రబాబు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

తర్వాతి కథనం
Show comments