Webdunia - Bharat's app for daily news and videos

Install App

రొనాల్డొ, ఇబ్రమోవిచ్ ఎట్టో మేమూ అట్టే.. ప్రపంచం సంగతి మాకెందుకు?: క్రిస్ గేల్

Webdunia
గురువారం, 9 జూన్ 2016 (10:50 IST)
వెస్టిండీస్ స్టార్ క్రిస్ గేల్ తన ఆత్మకథ సిక్స్ మెషీన్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫుట్‌బాల్‌లో రొనాల్డో (పోర్చుగల్), ఇబ్రమోవిచ్ (స్వీడన్) ఎలాంటివారో... క్రికెట్‌లో తానూ అలాంటి వాడినేనని వెస్టిండీస్ స్టార్ క్రిస్‌గేల్ అన్నాడు. తామంతా చాంపియన్ల కోవకు చెందిన వాళ్లమని.. ప్రపంచం ఏమనుకున్నా.. తమకు అవసరం లేదని క్రిస్ గేల్ వెల్లడించాడు. ఎప్పుడూ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఆడటమే తమ నైజమని.. రికార్డుల కోసం పాకులాడేది లేదన్నాడు. 
 
ఇకపోతే.. వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ మరోసారి అభిమానుల్ని ఆశ్చర్యపరిచాడు. అటు వెస్టిండీస్ జట్టులో స్థానం కోల్పోయిన గేల్.. మాంచెస్టర్ యునైటెడ్తో ఒప్పందం చేసుకున్నానంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే మాంచెస్టర్ మేనేజర్తో సమావేశమై తన ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నానంటూ గేల్ పేర్కొనడంతో  ప్రేక్షకులను ఆలోచనలో పడేసింది. 
 
తాను క్రికెటర్ని అవ్వకపోతే, ఫుట్ బాల్ ఆటగాడ్ని అయ్యేవాడినని స్పష్టం చేశాడు. ప్రస్తుతం విండీస్ బోర్డుతో విభేదాల కారణంగా జట్టులో స్థానం కోల్పోయిన గేల్..  వచ్చే ఏడాది బిగ్ బాష్ లీగ్ కాంట్రాక్టును కూడా కోల్పోయిన సంగతి తెలిసిందే.

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

తర్వాతి కథనం
Show comments