రెహమ్ రాజకీయాల్లోకి వస్తానంది.. ఇమ్రాన్ ఖాన్ తలాఖ్ చెప్పేశాడు!

Webdunia
శుక్రవారం, 30 అక్టోబరు 2015 (15:50 IST)
పాకిస్థాన్ మాజీ క్రికెటర్, పాకిస్థాన్ తెహ్రిక్ ఇన్ సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ రెండో భార్య రెహమ్‌కు తలాఖ్ చెప్పేశాడు. రెహమ్ రాజకీయాల్లోకి వస్తానని చెప్పడంతో మనస్తాపం చెందిన ఇమ్రాన్ తలాఖ్ చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఇమ్రాన్ ఖాన్, రెహమ్ ఖాన్ విడిపోయినట్లు పాక్ తెహ్రిక్ ఇన్ సాఫ్ అధికార ప్రతినిధి నయీమ్ ఉల్ హక్ ధ్రువీకరించారు. పరస్పర అంగీకారంతోనే వీరిద్దరూ విడాకులు తీసుకున్నట్లు పాక్ తెహ్రిక్ ఇన్ సాఫ్ ఓ ప్రకటనలో తెలిపింది. 
 
విడాకుల విషయంపై మీడియా దుమారం రేపొద్దని, తమ వ్యక్తిగత విషయాలకు దూరంగా ఉండాలని వారిరువురు కోరినట్టు ఆ ప్రకటనలో నయీమ్ ఉల్ హక్ విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఈ విషయాన్ని ఇమ్రాన్, రెహమ్‌లు ట్విట్టర్ లో కూడా ధ్రువీకరించారు. పది నెలల కిందట పెళ్లైన వారిద్దరికీ ఇది రెండో వివాహమన్న సంగతి తెలిసిందే. కాగా.. మెహర్‌కు 180 మిలియన్లును చెల్లించినట్లు తెలుస్తోంది. 
 
ఇకపోతే.. 63 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్.. బ్రిటీష్‌కు చెందిన జెమీమా ఖాన్‌ను తొలి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంటకు ఇద్దరు కుమారులున్నారు. రెండో వివాహంగా టీవీ జర్నలిస్ట్ మెహర్‌ను ఈ ఏడాది జనవరి 8న ఇమ్రాన్ ఖాన్ నిరాడంబరంగా పెళ్లాడిన సంగతి విదితమే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండిగో సంక్షోభంపై నోరెత్తిన కేటీఆర్.. సంపద కొన్ని సంస్థల చేతుల్లోనే కూరుకుపోయింది..

పుతిన్-మోడీ ఫ్రెండ్‌షిప్‌ని మా ట్రంప్ దృఢతరం చేసారు, ఇవ్వండి నోబెల్ అవార్డ్, ఎవరు?

పరకామణిలో తప్పు చేసాను, నేను చేసింది మహా పాపం: వీడియోలో రవి కుమార్ కన్నీటి పర్యంతం

Jogi Ramesh: లిక్కర్ కేసు.. జోగి రమేష్‌పై ఛార్జీషీట్ దాఖలు చేసిన సిట్

అందుకే నేను చెప్పేది, పవన్ సీఎం అయ్యే వ్యక్తి, జాగ్రత్తగా మాట్లాడాలి: ఉండవల్లి అరుణ్ కుమార్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

Show comments