Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీవేమైనా ఆయనతో పడుకున్నావా?: ఇంజమామ్ మేనల్లుడి ప్రశ్న

పాకిస్థాన్ మాజీ కెప్టెన్, ప్రస్తుత చీఫ్ సెలక్టర్ ఇంజమామ్ ఉల్ హక్ మేనల్లుడు ఇమామ్ ఉల్ హక్.. పాకిస్థాన్ ఓపెనర్‌గా ఆడుతున్న సంగతి తెలిసిందే. భారత జర్నలిస్ట్ అడిగిన ఓ ప్రశ్నపై ఇమామ్ ఉల్ హక్ అసహనం వ్యక్తం

Webdunia
ఆదివారం, 16 సెప్టెంబరు 2018 (13:57 IST)
పాకిస్థాన్ మాజీ కెప్టెన్, ప్రస్తుత చీఫ్ సెలక్టర్ ఇంజమామ్ ఉల్ హక్ మేనల్లుడు ఇమామ్ ఉల్ హక్.. పాకిస్థాన్ ఓపెనర్‌గా ఆడుతున్న సంగతి తెలిసిందే. భారత జర్నలిస్ట్ అడిగిన ఓ ప్రశ్నపై ఇమామ్ ఉల్ హక్ అసహనం వ్యక్తం చేశాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే శ్రీలంకపై సెంచరీ సాధించి ఈ ఓపెనర్‌ ప్రపంచ దృష్టిని ఆకర్షించిన అతనికి విలేకరి నుంచి ఓ సరదా ప్రశ్న ఎదురైంది. ''మీ మామ ఇంజుమామ్‌ ఉల్‌ హక్‌ చాలా సేపు నిద్రపోయేవాడు. నీవు కూడా అతనిలా నిద్రపోతావా?'' అని విలేకరి అడిగాడు. 
 
దీనికి ఆగ్రహానికి లోనైన ఇమామ్‌.. ''మా మామ చాలాసేపు నిద్రపోతాడని నీకెలా తెలుసు? నీవేమైనా ఆయనతో పడుకున్నావా?'' అని ఎదురు ప్రశ్నించాడు. దీంతో అక్కడున్న జర్నలిస్ట్‌లు అవాక్కయ్యారు. సరదాగా అడిగిన ప్రశ్నకు ఇంత సీరియస్‌ అవ్వడం ఏంటని ఆశ్చర్యపోయారు. 
 
అంతేగాకుండా ఇటీవల ఇమామ్‌ మీడియాపై అసహనం వ్యక్తం చేశాడు. తన మామ ఇంజుమామ్‌ వల్లే తనకు జట్టులో చోటు దక్కిందన్న మీడియా విమర్శలపై స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంజుమామ్‌ తనకు మేనమామ కావడం తన తప్పు కాదని స్పష్టం చేశాడు. విమర్శలకు తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పానని, ఆసియాకప్‌లో సైతం రాణిస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. 
 
ఆసియాకప్‌లో ప్రతి మ్యాచ్‌ తనకు ముఖ్యమేనని, భారత్‌తో మ్యాచ్‌ తనకేం ప్రత్యేకం కాదని ఇంజమామ్ ఉల్ హక్ తెలిపాడు. కాగా గతేడాది అక్టోబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ఇమామ్‌ ఇప్పటికే వన్డేల్లో 4 సెంచరీలు సాధించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: శనివారం నుంచి అమలులోకి హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు

కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-II: ఏపీకి 95 శాతంతో పోల్చితే.. తెలంగాణకు 15శాతం మాత్రమే?

Bridegroom: వివాహానికి ముందు రోజు వేరొక స్త్రీని పెళ్లాడిన వరుడు ఎక్కడ?

పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. అలా జరిగితే అదే చివరి రోజట...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Praveen: మారుతీ వల్లే నా లైఫ్ సెట్ అయింది : కమెడియన్‌ ప్రవీణ్‌

Raj: సమంత శుభం తో రాజ్ ను జీవితభాగస్వామిని ఎంచుకుందా !

Blackbuck poaching case: కృష్ణ జింకల వేట కేసు: సైఫ్ అలీ ఖాన్, టబు, నీలం, సోనాలి కు షాక్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

తర్వాతి కథనం
Show comments