ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ : రిలీ రోసో వీరవిహారం.. తొలి సెంచరీ వీరుడు...

Webdunia
గురువారం, 27 అక్టోబరు 2022 (15:20 IST)
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ సూపర్ 12 గ్రూపు ఏలో సౌతాఫ్రికా జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆ జట్టు ఆటగాడు రిలీ రోసో వీరోచితంగా బ్యాటింగ్ చేయడంతో సౌతాఫ్రికా జట్టు ఘన విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో సౌతాఫ్రికా జట్టు 205 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు 16.3 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో సఫారీలు 104 పరుగుల విజయలక్ష్యంతో గెలుపొందింది. 
 
అయితే, ఈ మ్యాచ్‌లో స్టార్ ఆటగాడు రిలీ రోసో ఆకాశమే హద్దుగా చెలరేగుతూ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 56 బంతులు ఎదుర్కొన్న రిలీ... ఏడు ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 109 పరుగులు చేశాడు. తద్వారా టీ20 వరల్డ్ కప్ ఎనిమిదో ఎడిషన్‌లో తొలి శతకం నమోదు చేసిన తొలి అటగాడిగా నిలిచాడు. భారత పర్యటనలో భాగంగా అక్టోబరులో టీమిండియాతో జరిగిన ఆఖరు టీ20లో 48 బంతుల్లో 100 పరుగులతో అజేయంగా నిలిచిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనవరిలో మరో డీఎస్సీ నోటిఫికేషన్ : మంత్రి నారా లోకేశ్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. ఎగ్జిట్ పోల్స్‌ నిషేధం.. ఈసీ సీరియస్ వార్నింగ్

తమిళనాడులో హిందీ భాషపై నిషేధమా? ఎవరు చెప్పారు? సీఎం స్టాలిన్ వివరణ

అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడనీ భర్తను హత్య చేయించిన భార్య

పోటీ పరీక్షల్లో సెక్స్‌కు సంబంధించిన మార్కులు కూడా వస్తాయంటూ... విద్యార్థినిలకు టీచర్ వేధింపులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : రష్మిక మందన్న ఫిల్మ్ మైసా కి స్టార్ కంపోజర్ జేక్స్ బిజోయ్ మ్యూజిక్

OG Trend: ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ ఓజీతో నయా ప్లాట్‌ఫాం గ్రాండ్ ఎంట్రీ..

Rahul Sankrityan: వీడీ 14 లో విజయ్ దేవరకొండ విశ్వరూపం చూస్తారు - రాహుల్ సంకృత్యన్

బుక్‌ మై షోపై విరుచుకుపడిన నిర్మాత బన్నీ వాసు

NTR: ఎన్.టి.ఆర్. సామ్రాజ్యం సరిహద్దులు దాటింది..

తర్వాతి కథనం
Show comments