Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ : భారత్ ఘన విజయం - సెమీస్‌లో ఇంగ్లండ్‌తో ఢీ

Webdunia
ఆదివారం, 6 నవంబరు 2022 (17:03 IST)
ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీల్లోభాగంగా, ఆదివారం జింబాబ్వేతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 186 పరుగులు చేసింది. జట్టులో ఓపెనర్లు రోహిత్ శర్మ 15, కేఎల్ రాహుల్ 51, కోహ్లీ 26, సూర్యకుమార్ 61, హార్దిక్ పాండ్యా 18, రిషబ్ పంత్ 3 చొప్పున పరుగులు చేశారు. ముఖ్యంగా, సూర్యకుమార్ యాదవ్ బ్యాట్‌తో వీరవిహారం చేశాడు. 25 బంతుల్లో 61 పరుగులు చేశాడు. 
 
ఆ తర్వాత 186 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే జట్టు.. .115 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 71 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో సెమీస్‌లో ఇంగ్లండ్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్ గురువారం మధ్యాహ్నం జరుగుతుంది. మరో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ - పాకిస్థాన్ జట్లు తలపడుతాయి. 
 
సూర్య ప్రతాపం.. జింబాబ్వే టార్గెట్ ఎంతంటే? 
ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీలోభాగంగా, ఆదివారం భారత్, జింబాబ్వే జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 185 పరుగులుచేసింది. ఫలితంగా జింబాబ్వే జట్టు ముంగిట 186 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాట్‌‍తో వీరవిహారం చేశాడు. 25 బంతుల్లోనే 61 పరుగులు చేసి భారత్ భారీ స్కోరు చేసేందుకు దోహదపడ్డారు. 
 
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కెప్టెన్ రోహిత్ శర్మకు ఆరంభంలో ఆశించిన ఫలితం రాలేదు. కెప్టెన్‌గా మరోమారు నిరాశపరిచాడు. కేవలం 15 పరుగులకే ఔట్ అయ్యాడు. మరోవైపు కేఎల్ రాహుల్ మాత్రం దూకుడుగా ఆడి 51 పరుగులు చేశాడు. అయితే, ఈ మ్యాచ్‌లోనూ విరాట్ కోహ్లీ 26 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. అయితే, హార్దిక్ పాండ్యాతో కలిసి సూర్యకుమార్ చెలరేగి ఆడాడు. 25 బంతుల్లో 61 పరుగులు చేశాడు. ఫలితంగా 20 ఓవర్లలో 185 పరుగులు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Roja: భయం అనేది మా నాయకుడు జగన్ రక్తంలో లేదు.. ఆర్కే రోజా (video)

Chandrababu: అంబేద్కర్‌ను గుర్తించడంలో కీలక పాత్ర ఎవరిది..? చర్చ జరగాల్సిందే.. చంద్రబాబు

పట్టపగలే చైన్ స్నాచింగ్.. కాలింగ్ బెల్ కొట్టి మహిళ మెడలోని..? (video)

Pune: బస్సులో వేధిస్తావా? పీటీ టీచర్ మజాకా.. 25సార్లు చెంప ఛెల్లుమనిపించింది.. (video)

ఫార్ములా ఈ రేస్‌ వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

నా ఆఫీసులో ప్రతి గోడ మీద హిచ్‌కాక్‌ గుర్తులు ఉన్నాయి : దర్శకులు వంశీ

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ సెకండ్ షెడ్యూల్

తర్వాతి కథనం
Show comments