Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ ట్వంటీ20 మ్యాచ్ : విరుచుకుపడిన భారత్ - ఆప్ఘాన్ టార్గెట్ 211

Webdunia
బుధవారం, 3 నవంబరు 2021 (21:23 IST)
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ ట్వంటీ20 టోర్నీలో భాగంగా బుధవారం భారత్, ఆప్ఘనిస్థాన్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగారు. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్‌ తిరిగి జట్టులోకి వచ్చినట్లు కోహ్లీ చెప్పాడు.
 
అలాగే చిన్నగాయం కారణంగా వరుణ్ చక్రవర్తి తప్పుకున్నాడని, అతని స్థానంలో అశ్విన్ జట్టులో చేరాడని వెల్లడించాడు. అలాగే నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘన్ జట్టు మాజీ సారధి అష్రాఫ్ ఆఫ్ఘన్ రిటైరయిన సంగతి తెలిసిందే. అతని స్థానంలో షరాఫుద్దీన్ ఆడనున్నాడు.
 
ఈ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్లు రెచ్చిపోయారు. ఓపెనర్లు కేఎల్ రాహుల్ 69, రోహిత్ శర్మ 74 చొప్పున పరుగులు చేసి తొలి వికెట్‌కు 140 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన రిషభ్ పంత్ 27, హార్దిక్ పాండ్యా 35 చొప్పున పరుగుల రాబట్టారు. ఫలితంగా నిర్ణీత  20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ భారత్‌కు అగ్నిపరీక్షలా ఉన్న విషయం తెల్సిందే. 
 
భారత జట్టు: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్‌ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మొహమ్మద్ షమీ, అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా
 
ఆఫ్ఘనిస్థాన్: హజ్రతుల్లా జజాయ్, మొహమ్మద్ షెహజాద్‌, రహ్మనుల్లా గుర్బాజ్‌, నజిబుల్లా జద్రాన్, మొహమ్మద్ నబీ, షరాఫుద్దీన్ అష్రాఫ్, గుల్బాదిన్ నైబ్, రషీద్‌ ఖాన్‌, కరీమ్ జనత్, నవీన్ ఉల్ హక్, హమీద్ హసన్‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

145 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఇంకా ఎక్కువ మంది పిల్లలను కనాలని అంటున్నారు ఎందుకు?

పేర్ని నాని గోదాముల్లో రేషన్ బియ్యం మాయం... క్రిమినల్ చర్యలు తప్పవు : మంత్రి నాదెండ్ల

ప్రైవేట్ లోన్ యాప్ వేధింపులు... బలైపోయిన మెదక్ జిల్లా వ్యక్తి

ఆప్ ఎంపీపై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా!

Sandhya Theatre Stampede: పుష్ప-2.. సంధ్య థియేటర్ తొక్కిసలాట- శ్రీతేజ్ బ్రెయిన్ డెత్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గేమ్ ఛేంజర్ లో దర్శకుడు శంకర్ ఎక్కుపెట్టిన అస్త్రం హైలైట్ ?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

తర్వాతి కథనం
Show comments