Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యూయార్క్ వేదికగా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ట్రోఫీ ఆవిష్కరణ

ఠాగూర్
బుధవారం, 20 మార్చి 2024 (10:39 IST)
న్యూయార్క్ వేదికగా ఐసీసీ ట్వంటీ20 వరల్డ్‌ కప్ ట్రోఫీని తాజాగా ఆవిష్కరించారు. న్యూయార్క్‌లోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌పై ట్రోఫీని క్రికెటర్లు క్రిస్ గేల్, అలీఖాన్‌లు ఆవిష్కరించారు. ఈ ట్రోఫీని 15 దేశాల్లో ప్రదర్శించనున్నారు. ఈ సీజన్‌కు అమెరికా, వెస్టిండీస్ దేశాలు ఆతిథ్యమివ్వనున్నారు. జూన్ 2 నుంచి 29వ తేదీ వరకు టోర్నీ, టోర్నీలో పాల్గొంటున్న 20 జట్లు పాల్గొంటున్నాయి. జూన్ 5, 9, 12, 15వ తేదీల్లో టీమిండియా మ్యాచ్‌లు ఆడనుంది. 
 
కాగా, అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా టీ20 ప్రపంచ కప్ నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. జూన్ రెండో తేదీ నుంచి 29వ తేదీ వరకు ఈ టోర్నీ జరగనుంది. మొత్తం 20 జట్లు నాలుగు గ్రూపులుగా విడిపోయి ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. జూన్ రెండో తేదీన టోర్నీ ప్రారంభ మ్యాచ్‌ అమెరికా, కెనడా మధ్య జరగనుంది. 
 
అదే రోజు రెండో మ్యాచ్‌లో విండీస్, పవువా న్యూ గినియా తలపడతాయి. ఒక టీమిండియా తన తొలి మ్యాచ్‌ను జూన్ 5వ తేదీన ఐర్లాండ్‌‍తో తలపడనుంది. ఆ తర్వాత 9వ తేదీన దాయాది దేశం పాకిస్థాన్ జట్టుతో ఆడుతుంది. 12వతేదీన అమెరికాతూ, 15వ తేదీన కెనడాతో టీమిండియా తన మ్యాచ్‌‌లను ఆడుతుంది. 
 
ఐపీఎల్ 2024 : ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా రిషబ్ పంత్ 
 
ఈ నెల 22వ తేదీ నుంచి ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభంకానుంది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ మంగళవారం కీలక ప్రకటన చేసింది. ఈ సీజన్‌కు తమ జట్టు కెప్టెన్‌గా భారత డాషింగ్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ పేరును ప్రకటించింది. 'వచ్చే సీజన్‌ ఎడిషన్‌లో రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. 14 నెల తర్వాత వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్ తిరిగి క్రికెట్ ఆడబోతున్న విషయంతెల్సిందే. విశాఖపట్నంలో జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ప్రీ-సీజన్ ట్రైనింగ్ క్యాంపులో పంత్ పాల్గొన్నాడు' అని వెల్లడించింది. 
 
ఢిల్లీ కెప్టెన్‌గా రిషబ్ పంత్ పేరుని ప్రకటించేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రత్యేక వీడియోను రూపొందించి షేర్ చేసింది. రోడ్డు ప్రమాదం కారణంగా గతేడాది ఐపీఎల్ సీజన్‌కు పంత్ దూరమైన విషయం తెల్సిందే. దీంతో ఆసీస్ ఆటగాడు డేవిడ్ వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్‌‍కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇప్పుడు పంత్ తిరిగి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టనున్నాడు. రోడ్డు ప్రమాదం నుంచి కోలుకొని తిరిగి కెప్టెన్‌గా పంత్ ఎంట్రీ ఇవ్వనుండడంపై సర్వత్రా అభినందనలు వ్యక్తమవుతున్నాయి. 
 
ఢిల్లీ క్యాపిటల్స్ చైర్మన్, టీమ్ సహ యజమాని పార్థ్ జిందాల్ స్పందిస్తూ.. పంత్‌కు స్వాగతం పలుకుతున్నాం. రిషబ్‌ను తిరిగి కెప్టెన్‌గా ప్రకటిస్తున్నందుకు సంతోషిస్తున్నామని చెప్పారు. ధైర్యంగా ఆడడం పంత్ బ్రాండ్ అని మెచ్చుకున్నారు. కొత్త సీజన్‌లో నూతనోత్సాహంతో ముందుకు సాగాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2024లో తొలి మ్యాచ్‌ను మార్చి 23న చండీగఢ్‌లో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

రణరంగంగామారిన సెంట్రల్ యూనివర్శిటీ - విద్యార్థుల ఆందోళనలు... అరెస్టులు

Telangana: తెలంగాణలో ఉచిత సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిన రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

తర్వాతి కథనం
Show comments