Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ క్రికెటర్లు ఆసిఫ్, సల్మాన్ భట్‌లపై నిషేధం ఎత్తివేసిన ఐసీసీ

Webdunia
గురువారం, 20 ఆగస్టు 2015 (10:00 IST)
అవినీతి వ్యవహారంలో నిషేధానికి గురైన పాకిస్థాన్ క్రికెటర్లు మహ్మద్ ఆసిఫ్, సల్మాన్ భట్‌పై ఐసీసీ నిషేధం ఎత్తివేసింది. మహ్మద్ ఆసిఫ్, సల్మాన్‌ భట్‌లపై విధించిన నిషేధం సెప్టెంబరు 1 అర్ధరాత్రితో ముగుస్తుందని ఐసీసీ తెలిపింది. 
 
ఆ క్రికెటర్లు సెప్టెంబరు 2 నుంచి అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్ ఆడేందుకు అర్హులని పేర్కొంది. ఇక, ఈ ఏడాది ఆరంభంలో పాక్ దేశవాళీ క్రికెట్ ఆడేందుకు అనుమతించిన మహ్మద్ అమీర్‌పై కూడా నిషేధం పూర్తి స్థాయిలో తొలగిపోతుందని ఐసీసీ వెల్లడించింది. అమీర్ కూడా ఇక అంతర్జాతీయ క్రికెట్ ఆడవచ్చని వివరించింది. 
 
2010 ఆగస్టులో ఇంగ్లాండ్-పాకిస్థాన్ జట్ల మధ్య ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో జరిగిన టెస్టులో ఈ ముగ్గురు ఆటగాళ్లు అవినీతికి పాల్పడ్డారంటూ స్వతంత్ర యాంటీ కరప్షన్ ట్రైబ్యునల్ తేల్చింది. కాగా, తమపై నిషేధం ఎత్తివేస్తున్నట్టు ఐసీసీ ప్రకటించడంతో పాక్ ఆటగాళ్లు హర్షం వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments