Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను వందశాతం ఫిట్.. రెండో టీ20 ఆడుతున్నా : విరాట్ కోహ్లీ

ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్న భారత క్రికెట్ జట్టు కెప్టెన్, డాషింగ్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ.. త‌ర్వాతి టీ-20 మ్యాచ్‌కు అందుబాటులో ఉండ‌డా? కోహ్లీ లేకుండానే బుధ‌వారం జ‌రుగ‌బో

Webdunia
సోమవారం, 19 ఫిబ్రవరి 2018 (16:55 IST)
ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్న భారత క్రికెట్ జట్టు కెప్టెన్, డాషింగ్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ.. త‌ర్వాతి టీ-20 మ్యాచ్‌కు అందుబాటులో ఉండ‌డా? కోహ్లీ లేకుండానే బుధ‌వారం జ‌రుగ‌బోయే మ్యాచ్‌లో టీమిండియా బరిలోకి దిగుతోందా? అనే ప్రశ్నలకు కోహ్లీనే సోమవారం సమాధానమిచ్చాడు.
 
తనకేం కాలేదని, రెండో టీ20 మ్యాచ్‌కు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు. గాయం గురించి వివరిస్తూ, సింగిల్ కోసం ప్రయత్నించి అదుపుతప్పానన్నాడు. అదృష్టవశాత్తు కండరం మాత్రమే పట్టుకుందన్నాడు. తానెంత వేగంగా నడుం వంచానో అందరికీ తెలుసని, అప్పుడే తొడ కండరం పట్టేసిందని చెప్పాడు. దాంతోనే తాను మైదానం వీడాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. ఇకపోతే, వైద్యుల వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని నిర్ణయించుకున్నానని కోహ్లీ తెలిపాడు. రెండో టీ20కి అందుబాటులో ఉంటానని చెప్పాడు.
 
కాగా, ఆదివారం జరిగిన తొలి ట్వంటీ20 మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు విజయభేరీ మోగించింది. ఈ మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 203 పరుగులు చేసింది. ఆ తర్వాత 204 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. దీంతో కోహ్లీ సేన 28 పరుగులు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

తర్వాతి కథనం
Show comments