టీమిండియా బ్యాట్సమెన్లను ఉతికి ఆరేసిన లియాన్.. 8 వికెట్లతో రికార్డ్.. 189కే కుప్పకూలిన కోహ్లీ సేన

పూణే టెస్టులో భారత బ్యాట్స్‌మెన్లకు ఆసీస్ స్పిన్నర్ ఓకీఫ్ చుక్కలు చూపిస్తే.. శనివారం బెంగుళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో స్టార్ స్పిన్నర్ నాథన్ లియాన్ అదరగొట్టాడు. ఫలితంగా తొలి ఇ

Webdunia
శనివారం, 4 మార్చి 2017 (17:16 IST)
పూణే టెస్టులో భారత బ్యాట్స్‌మెన్లకు ఆసీస్ స్పిన్నర్ ఓకీఫ్ చుక్కలు చూపిస్తే.. శనివారం బెంగుళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో స్టార్ స్పిన్నర్ నాథన్ లియాన్ అదరగొట్టాడు. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 189 పరుగులకే ఆలౌటైంది. పూణె టెస్టు మాదిరే మరోసారి ఆస్ట్రేలియా స్పిన్ ఉచ్చులో కోహ్లీ సేన పడింది.

బెంగుళూరు టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు తీసి అరుదైన రికార్డు సాధించాడు. ఫలితంగా ఒకే టెస్టులో పది వికెట్ల రికార్డుకు కొంతదూరంలో నాథన్ లియాన్ నిలిచాడు. తద్వారా భారత ఉపఖండంలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా ఆసీస్ స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ పేరిట ఉన్న రికార్డును నాథన్ లియాన్ అధిగమించాడు.
 
అంతే కాకుండా బెంగళూరు చిన్నసామి స్టేడియంలో ఇంతవరకు ఏ విదేశీ బౌలర్ సాధించని రికార్డును ఈ పిచ్‌పై అత్యధిక వికెట్లు తీసిన తొలి విదేశీ ఆటగాడిగా లియాన్ నిలిచాడు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత బ్యాట్స్‌మెన్లకు నాథన్ లియాన్ చుక్కలు చూపించాడు. ఫలితంగా 22.2 ఓవర్లు బౌలింగ్ చేసిన లియాన్ 4 మెయిడెన్ ఓవర్లు వేసి 2.23 సగటుతో 50 పరుగులిచ్చి 8 వికెట్లు తీసుకున్నాడు.
 
లియాన్ చేతిలో పుజారా (17), విరాట్‌ కోహ్లీ (12), రహానే (17), రవిచంద్రన్ అశ్విన్‌ (7), వృద్ధిమాన్‌ సాహా (3), రవీంద్ర జడేజా (3), కేఎల్‌ రాహుల్‌ (90), ఇషాంత్‌శర్మ (0) అవుట్ అయ్యారు. ఫలితంగా ఒకే టెస్టులో ఐదు వికెట్లు తీసిన ఐదో పర్యాటక బౌలర్‌‌గా నాథన్ లియాన్‌ నిలిచాడు. అంతేకాదు టీమిండియాపై అత్యధిక వికెట్లు (58) తీసిన ఆస్ట్రేలియా బౌలర్‌గా కూడా అవతరించాడు. ఫలితంగా 71.2 ఓవర్లలో కేవలం 189 పరుగుల వద్ద టీమిండియా ఆలౌటైంది. తదనంతరం బ్యాటింగ్ దిగిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో ఆచితూచి ఆడింది. ఫలితంగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 16 ఓవర్లలో 40 పరుగులు సాధించింది. వార్నర్ (23), రెన్షా (15)లు క్రీజులో ఉన్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదులో విదేశీ మహిళలతో వ్యభిచారం.. స్టూడెంట్ వీసాతో వచ్చి..?

దేశంలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు సమయం ఆసన్నమైంది : పవన్ కళ్యాణ్

నా ముందు ప్యాంట్ జిప్ తీస్తావా? చీపురుతో చితక్కొట్టిన పారిశుద్ధ్య కార్మికురాలు (video).. ఎక్కడ?

కొత్త ఇల్లు కట్టావ్ లక్ష ఇస్తావా లేదా? ఇవ్వనన్నందుకు యజమానిని చితక్కొట్టిన హిజ్రాలు

Low Pressure: బంగాళాఖాతంలో నవంబర్ 19 నాటికి అల్పపీడనం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ధర్మేంద్ర... ఇంట్లోనే వైద్య సేవలు

'ది గర్ల్ ఫ్రెండ్' కోసం ముఖ్య అతిథిగా హాజరుకానున్న విజయ్ దేవరకొండ?

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

తర్వాతి కథనం
Show comments