Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్ లయన్స్ చేతిలో రాయల్ ఛాలెంజర్స్ ఓటమి: శతకం చేసినా వృధా.. కోహ్లీ హార్ట్ బ్రోకెన్

Webdunia
సోమవారం, 25 ఏప్రియల్ 2016 (14:58 IST)
ఆదివారం గుజరాత్ లయన్స్ చేతిలో పరాజయం పాలవడాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ జీర్ణించుకోలేకపోతున్నాడు. ఈ క్రమంలో గుజరాత్ లయన్స్ చేతిలో ఓడిపోవడం ఎంతో బాధను మిగిల్చిందన్నాడు. ఇంకా ఐపీఎల్‌లో తొలి శతకాన్ని నమోదు చేసుకోవడం కూడా సంతోషాన్నివ్వలేదని తెలిపాడు. 
 
జట్టు స్కోరు 170 కావడమే లక్ష్యంగా పెట్టుకున్నానని ఏ దశలోనూ సెంచరీ గురించి ఆలోచించట్లేదని చెప్పుకొచ్చారు. కానీ జట్టు ఓడిపోవడం గురించి ఆలోచించనే లేదని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఆదివారం జరిగిన మ్యాచ్ లో కోహ్లీ (100 నాటౌట్‌; 63 బంతుల్లో 11×4, 1×6) కెరీర్‌లో తొలి టీ20 సెంచరీ చేసినా అది వృధా అయిన సంగతి తెలిసిందే. 
 
గుజరాత్‌ లయన్స్‌ 6 వికెట్ల తేడాతో బెంగళూరును ఓడించింది. విరాట్‌ కోహ్లీ శతకంతో అదరగొట్టినా గుజరాత్‌ లయన్స్‌ చేతిలో బెంగళూరుకు ఓటమి తప్పలేదు. ఆదివారం మొదట బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు.. కోహ్లి సెంచరీ సాయంతో 20 ఓవర్లలో 180/2 స్కోరు చేసింది. కాగా, దినేశ్‌ కార్తీక్‌ (50 నాటౌట్‌; 39 బంతుల్లో 3×4) సమయోచిత ఇన్నింగ్స్‌తో గుజరాత్‌ 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments