Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్ ఆడితే కాల్చి చంపేస్తామన్నారు.. అన్నయ్యలపై సోదరి ఫిర్యాదు

క్రికెట్ ఆడితే కాల్చేస్తామని బెదిరించిన అన్నయ్యలపై యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు సోదరుల నుంచి ప్రాణహాని వుందని ఆవేదన వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళితే.. హర్యానాలోని సోనెపట్ జిల్లా దేవ్రు గ్

Webdunia
శుక్రవారం, 27 అక్టోబరు 2017 (10:04 IST)
క్రికెట్ ఆడితే కాల్చేస్తామని బెదిరించిన అన్నయ్యలపై యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు సోదరుల నుంచి ప్రాణహాని వుందని ఆవేదన వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళితే.. హర్యానాలోని సోనెపట్ జిల్లా దేవ్రు గ్రామానికి చెందిన ఓ యువతి బీఐ సెకండియర్ చేస్తోంది. క్రికెట్‌ అంటే ఆ యువతికి ప్రాణం. కళాశాలలో క్రికెట్ బాగా ఆడేది. కానీ క్రికెట్ ఆడుతున్న విషయాన్ని తెలుసుకున్న సదరు యువతి సోదరులు ఆమెపై కోపంతో కాలేజీ మాన్పించారు.
 
కాలేజీ మాన్పించడం ఆమెకు ఇష్టం లేదు. చదువుకుంటానని, క్రికెట్ ఆడతానని సోదరులకు చెప్తే వాళ్లు ఆమెపై చేజేసుకున్నారు. అంతేగాకుండా క్రికెట్ ఆడితే  ప్రాణంగా భావించే బాలిక కళాశాలలో క్రికెట్ ఆడేది. విషయం తెలిసిన ఆమె ఇద్దరు సోదరులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెను కాలేజీ మాన్పించారు. ఇంకా క్రికెట్ ఆడితే కాల్చి చంపేస్తామంటూ బెదిరించినట్లు బాధిత యువతి పోలీసులకు చేసిన ఫిర్యాదులో తెలిపింది. 
 
క్రికెట్‌ ఆడాలన్నది తన సొంత నిర్ణయమేనని, ఈ విషయంలో టీచర్లు, కాలేజ్ మెంటార్ల ఒత్తిడి లేదని యువతి పేర్కొంది. తన సోదరులకు దూరంగా బతకాలనుకుంటున్నానని, తన ఆశయాలకు అనుగుణంగా జీవితాన్ని మలచుకోవాలనుకుంటున్నానని యువతి పోలీసులకు తెలిపింది. సోదరుల నుంచి తనకు ప్రాణహాని వుందని చెప్పుకొచ్చింది. యువతి ఫిర్యాదుతో పోలీసులు ఆమె సోదరులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నైరుతి బంగాళాఖాతంలో తుఫాను.. తిరుమలలో భారీ వర్షాలు.. భక్తుల ఇక్కట్లు

కాబోయే భర్తతో అలా షికారుకు వెళ్లిన 20 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం

కార్మికులకు పింఛన్ కనీస మొత్తం రూ.7 వేలా? కేంద్ర మంత్రి ఏమంటున్నారు?

వీడియో గేమ్ డెవలప్‌మెంట్‌లో కెరీర్ మార్గాలు: లక్ష్య డిజిటల్ సాంకేతిక ముందడుగు

అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త.. కొట్టి చంపేసిన భార్య.. ఆ తర్వాత కొడుకు ముందే..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

తర్వాతి కథనం
Show comments