Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోహిత్ శర్మ లేని భారత జట్టును ఆదరించను.. భజ్జీ కామెంట్ చేశాడా?

Webdunia
సోమవారం, 3 డిశెంబరు 2018 (13:40 IST)
భారత మాజీ స్టార్ ప్లేయర్ హర్భజన్ సింగ్ పేరిట నకిలీ ట్విట్టర్ అకౌంట్ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ అకౌంట్ వివాదాన్ని కొనితెచ్చిపెట్టింది. టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ మంచి ఫామ్‌లో వున్నాడు. రోహిత్ శర్మను హిట్ మ్యాన్ అంటూ క్రికెట్ ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కానీ వన్డే, ట్వంటీ-20 ఫార్మాట్‌లలో అదరగొట్టే రోహిత్ శర్మకు సంప్రదాయ టెస్టు జట్టులో మాత్రం స్థానం ఖరారు కాలేదు. 
 
గత ఏడాది పాటు టెస్టు క్రికెట్ జట్టులో స్థానం కోసం రోహిత్ శర్మ పోరాటం చేస్తున్నాడు. అయితే ప్రస్తుతం రోహిత్ శర్మ.. ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు క్రికెట్ సిరీస్‌కు ఎంపికయ్యాడు. కానీ 11 క్రికెటర్లతో కూడిన టీమిండియా జట్టులో రోహిత్ శర్మ తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడా అనేది ఇంకా ఖరారు కాలేదు. రోహిత్ శర్మకు టెస్టు జట్టులో స్థానం దక్కకపోవడానికి కెప్టెన్ కోహ్లీనే కారణమని కూడా చర్చ సాగుతోంది.
 
ప్రస్తుతం తాజాగా కొత్త వివాదం తలెత్తింది. టెస్టు జట్టులో రోహిత్ శర్మ లేకపోతే తాను గుడ్డిగా ఆస్ట్రేలియా జట్టుకు మద్దతిస్తానని.. మాజీ స్టార్ బౌలర్ హర్భజన్ సింగ్‌ చెప్పినట్లు ట్వీట్ రావడం వివాదస్పదమైంది. దీంతో అందరూ భజ్జీని తిట్టడం మొదలెట్టారు. ఈ విషయాన్ని తెలుసుకున్న హర్భజన్ సింగ్ వివరణ ఇచ్చాడు. 
 
ట్విట్టర్లో తాను ఎలాంటి ట్వీట్ చేయలేదని, రోహిత్ శర్మ గురించి తాను చేసినట్లు వచ్చిన ట్విట్టర్ అకౌంట్ నకిలీదని భజ్జీ తేల్చేశాడు. ఇలాంటి గాలి వార్తలను పక్కనబెట్టి.. అందరం కలిసి టీమిండియాకు మద్దతు పలుకుదామని భజ్జీ వెల్లడించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ABPM-JAY: ఆయుష్మాన్ భారత్ 9.84 కోట్లకు పైగా ఆస్పత్రుల్లో చేరేందుకు అనుమతి

Car Climbs Wall: కాంపౌండ్ గోడపైకి ఎక్కిన కారు.. డ్రైవర్ ఎలా నడిపాడంటే?

బరువు తగ్గేందుకు ఫ్రూట జ్యూస్ డైట్.. చివరకు...

నిద్రమత్తులో డ్రైవింగ్ చేస్తూ కారును ప్రహరీ గోడపైకి ఎక్కించిన డ్రైవర్

Hyderabad: భార్యాభర్తల గొడవలు నాలుగు గోడలకే పరిమితం కాదు.. హత్యల వరకు వెళ్తున్నాయ్!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫిష్ వెంకట్ కుటుంబానికి నేనున్నా.. రూ.1.5 లక్షలు ఇచ్చిన సోనూ సూద్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్-9‌లో కన్నడ నటి.. ఆమె ఎవరు?

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

తర్వాతి కథనం
Show comments