Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాట్ కోహ్లీకి అంత సీన్ లేదు: గ్రేమ్ స్మిత్

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ నాయకత్వ పటిమపై సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ పలు సందేహాలు వ్యక్తం చేశారు. భారత్‌ తరపున అతడు సుదీర్ఘకాలం సారథ్యం వహిస్తాడో లేడో చెప్పలేనన్నారు.

Webdunia
బుధవారం, 24 జనవరి 2018 (07:37 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ నాయకత్వ పటిమపై సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ పలు సందేహాలు వ్యక్తం చేశారు. భారత్‌ తరపున అతడు సుదీర్ఘకాలం సారథ్యం వహిస్తాడో లేడో చెప్పలేనన్నారు. 
 
‘చూస్తుంటే భారత్‌కు అతడు (కోహ్లీ) సుదీర్ఘకాల సారథిగా మనగలుగుతాడో లేదో చెప్పలేను. ఈ ఏడాది ముగిసే వరకు అతడు విదేశాల్లోనే పర్యటించాల్సి ఉంది. తీవ్ర ఒత్తిడి అనుభవించాల్సి ఉంటుంది. మీడియా నుంచి ఇష్టంలేని ప్రశ్నలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. సొంత దేశంలో అతడికి మద్దతు దొరకొచ్చేమోగానీ విదేశాల్లో మాత్రం అలా కుదరదు. జట్టు పరంగా విఫలమై ఇబ్బందులు పడుతుంటే ఆ భారం కోహ్లీ మోయగలడో లేదో! ఈ పరిస్థితులను తట్టుకునే మెరుగైన నాయకుడు భారత్‌లో ఉన్నాడా అన్న సంగతి తెలియదు’ అని స్మిత్‌ అన్నారు. 
 
జట్టులో పదేపదే చేస్తున్న మార్పులు కోహ్లీకి ఇబ్బందులు తెస్తున్నాయి. దక్షిణాఫ్రికాలో మెరుగైన రికార్డున్న రహానెను పక్కన పెట్టి ప్రస్తుత ఫామ్‌ ఆధారంగా రోహిత్‌ను ఎంపిక చేశాడు. తొలి టెస్టులో భువి అద్భుతమైన ఆరంభం ఇచ్చినా రెండో టెస్టుకు దూరం చేశాడు. దీంతో తుదిజట్టు ఎంపిక తీరుపై విరాట్‌పై తీవ్ర విమర్శలు రేగిన సంగతి తెలిసిందే. 
 
అదేవిధంగా మైదానంలో నాయకుడి ప్రవర్తన మిగతా ఆటగాళ్లందరిపై ప్రభావం చూపిస్తుందని స్మిత్‌ పేర్కొన్నారు. ఈ విషయాన్ని బాగా గుర్తెరిగి ముందడుగు వేస్తేనే మంచి నాయకుడు అవుతారన్నారు. కోహ్లీ తన జట్టు సభ్యులతో ఇంకా మమేకంకావాల్సి ఉందన్నారు. నాయకుడి కొన్నిచర్యలు మిగతా వారిపై చెడు ప్రభావం చూపించగలవు కాబట్టి జాగ్రత్తగా ఉండాలన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంజనేయ స్వామికి ఆలయంలో వానరం.. గదపట్టుకుని దర్శనం (video)

కుమారుడికి క్షమాభిక్ష పెట్టుకున్న జో బైడెన్!!

మానవత్వాన్ని చాటిన నందిగామ ఎస్సై.. ఏం చేశారంటే? (video)

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్.. డిప్యూటీ సీఎం రేసులో శ్రీకాంత్ షిండే!!

భోజనం పళ్లెంలో ఏమేం ఉండాలి? రోజుకు ఎంత ప్రోటీన్ అవసరం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

అప్పుడు డిస్సాపాయింట్ అయ్యాను, సలహాలు ఇవ్వడం ఇష్టం వుండదు : శ్రీను వైట్ల

కృష్ణుడికి భక్తుడికి మధ్య నడిచే కథే డియర్ కృష్ణ : పి.ఎన్. బలరామ్

ఫీలింగ్స్ చాలా కష్టమైన పాట... కానీ ఎంజాయ్ చేశా : రష్మిక మందన్నా (Video)

తర్వాతి కథనం
Show comments