Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువీ.. భార్య నుంచి బౌన్సర్లు తప్పవ్.. చెస్ట్‌గార్డుల్లేవ్.. బీకేర్ ఫుల్.. నా టిప్స్ పాటించు: గంభీర్

టీమిండియా స్టార్ ప్లేయర్ యువరాజ్ సింగ్, తన స్నేహితురాలు, నటి హాజల్ కీచ్‌ను బుధవారం అతను పెళ్లాడాడు. చండీగఢ్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఫతేగఢ్ సాహిబ్ గ్రామం వద్ద ఉన్న ధార్మిక కేంద్రం ‘బాబా రాందేవ్ సింగ్ డ

Webdunia
గురువారం, 1 డిశెంబరు 2016 (14:17 IST)
టీమిండియా స్టార్ ప్లేయర్ యువరాజ్ సింగ్, తన స్నేహితురాలు, నటి హాజల్ కీచ్‌ను బుధవారం అతను పెళ్లాడాడు. చండీగఢ్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఫతేగఢ్ సాహిబ్ గ్రామం వద్ద ఉన్న ధార్మిక కేంద్రం ‘బాబా రాందేవ్ సింగ్ డేరా’లో వివాహ వేడుక జరిగింది. పంజాబీ సంప్రదాయం ‘ఆనంద్ కరాజ్’ పద్ధతిలో యువీ వివాహం జరిగింది.

అనంతరం రాందేవ్ సింగ్ కొత్త దంపతులను ఆశీర్వదించారు. ఈ నేపథ్యంలో మైదానంలో ఎప్పుడూ సీరియస్‌గా ఉండే.. గంభీర్‌ యువీ పెళ్ళిపై ఫన్నీ కామెంట్స్ చేశాడు. యువరాజ్‌ సింగ్‌ను ఆటపట్టిస్తూ గంభీర్‌ చేసిన సరదా ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పెళ్లైన సందర్భంగా యువీకి పలు జాగ్రత్తలు చెబుతూ గంభీర్‌ ట్వీట్‌ చేశాడు. 
 
‘పెళ్లిలో మంచి షేర్వాణీ ధరించిన యువరాజ్‌.. ఎవరికీ తెలియకుండా లోపల బాల్స్ ఛాతికి తగలకుండా బ్యాట్స్‌మెన్లు ధరించే చెస్ట్‌గార్డ్‌ కూడా ధరించే ఉంటాడు. అయితే పెళ్లి తర్వాత భార్య నుంచి ఎదురయ్యే బౌన్సర్లను అడ్డుకునేందుకు ఇప్పటివరకు ఎవరూ చెస్ట్‌గార్డ్‌లను తయారుచేయలేదని యువీ తెలుసుకోవాలని కామెంట్స్ చేశాడు.

పెళ్లయ్యాక చాలా కష్టాలు తప్పవ్. కొత్త పెళ్లి కొడుక్కి తాను సహాయం చేస్తానని, భార్య నుంచి బౌన్సర్లను ఎదుర్కొనేందుకు తన వద్ద కొన్ని టిప్స్ ఉన్నాయని గంభీర్ వ్యాఖ్యానించాడు. యువీని ఈసారి కలిసినపుడు ఆ టిప్స్ ఏంటో చెప్తాను. అప్పటివరకు మాత్రం యువీకి బెస్ట్ విషెస్ అంటూ గంభీర్ ట్వీట్ చేశాడు.

ఆగస్టు 15లోగా రైతుల 2 లక్షల పంట రుణాల మాఫీ.. ఏర్పాట్లు ఆరంభం

41 రోజుల రాజశ్యామల సహస్ర చండీయాగంలో జగన్

పాఠ్యపుస్తకాల మందం తగ్గింది.. ఈసారి ఆ ఇబ్బంది వుండదు..

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments