Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ : సీటు కోసం కొట్టుకున్న ఫ్యాన్స్

Webdunia
ఆదివారం, 22 అక్టోబరు 2023 (09:59 IST)
స్వదేశంలో ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీలు ఈ నెల 5వ తేదీన ప్రారంభంకాగా, ఇప్పటివరకు సాఫీగానే సాగిపోతున్నాయి. అయితే, స్టేడియాల్లో మాత్రం క్రికెట్ అభిమానులు చిన్నపాటి కోపతాపాలకు లోనవుతున్నారు. ఇలాంటి సంఘటన ఒకటి ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా చోటుచేసుకుంది. నిజానికి క్రికెట్ అంటే అభిమానుల భావోద్వేగం కాబట్టి వారి ఎమోషన్స్ పీక్స్‌లోనే ఉంటాయి. దీంతో వారు చిన్నచిన్న విషయాలకే నిగ్రహం కోల్పోయి గోడవపడుతుంటారు. దీంతో స్టేడియాల్లో చిన్నపాటి ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. 
 
ఇటీవల బెంగళురులోని చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియా - పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ సందర్భంగా ఇలాంటి దృశ్యం వెలుగులోకి వచ్చింది. ఓ సీటు గురించి ఇద్దరు ప్రేక్షకుల మధ్య గొడవ తాలూకు వీడియో వైరల్‌గా మారింది. తొలుత ఆ ఇద్దరు ప్రేక్షకులు మాటామాట అనుకుని ఆ తర్వాత ఒకరినొకరు తోసుకుని కిందపడిపోయారు. ఈ వివాదం మరింత ముదిరేలోపే అక్కడున్న వారు ఇతర అభిమానులు ఇద్దరినీ వారించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. 
 
మరోవైపు, ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు పాకిస్థాన్‌పై 62 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు మార్ష్, వార్నర్ అద్భుత శుభారంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌కు వీరిద్దరూ ఏకంగా 259 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఆస్ట్రేలియా విజయానికి గట్టిపునాది వేశారు. అదేసమయంలో పాకిస్థాన్ ఆటగాళ్లు కీలక క్యాచ్‌లను వదిలిపేయడంతో తగిన మూల్యం చెల్లించుకున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

క్యాన్సర్ పేషెంట్‌పై అత్యాచారం చేశాడు.. ఆపై గర్భవతి.. వ్యక్తి అరెస్ట్.. ఎక్కడ?

మలబార్ గోల్డ్ అండ్ డైమెండ్స్‌లో బంగారు కడియం చోరీ.. వీడియో వైరల్

ఆన్‌లైన్ బెట్టింగ్, గేమ్స్ ఆడేందుకు అప్పులు.. రైలు కింద దూకేశాడు

పోలీసుల ముందు లొంగిపోయిన 86మంది మావోయిస్టులు..

మంచాన్ని కారుగా మార్చుకున్నాడు... ఎంచక్కా రోడ్డుపై జర్నీ - వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

తర్వాతి కథనం
Show comments