Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైజాగ్ టెస్ట్ : విజృంభించిన‌ అశ్విన్‌... 255 ప‌రుగుల‌కే ఇంగ్లండ్ ఆలౌట్

వైజాగ్ టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు తన మొదటి ఇన్నింగ్స్‌లో 255 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు ఆర్.అశ్విన్ విజృంభించడంతో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లు వరుసగా పెవిలియన్ దారిపట్టారు.

Webdunia
శనివారం, 19 నవంబరు 2016 (14:49 IST)
వైజాగ్ టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు తన మొదటి ఇన్నింగ్స్‌లో 255 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు ఆర్.అశ్విన్ విజృంభించడంతో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లు వరుసగా పెవిలియన్ దారిపట్టారు. కాగా, భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 455 ప‌రుగులకు ఆలౌట్ అయిన విషయం తెల్సిందే. ఆ తర్వాత ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్‌కు దిగి రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఐదు వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. ఇదే స్కోరుతో మూడో రోజు ఆట‌ ప్రారంభించిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ శనివారం కూడా క్రీజ్‌లో నిలదొక్కుకోలక పోయారు. 
 
దీంతో ఇంగ్లండ్ 255 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లో కుక్ 3, హ‌మీద్ 13, రూట్ 53, డ‌కెట్ 5, అలీ 1, స్టోక్స్ 70, బ‌యిర్ స్టో 53, ర‌షీద్ 32, అన్సారీ 4, బ్రాడ్ 13, అండ‌ర్స‌న్ 0 ప‌రుగులు చేశారు. ఫలితంగా భారత్‌కు 200 పరుగుల ఆధిక్యం లభించింది. మొదటి ఇన్నింగ్స్‌లో అశ్విన్‌కి ఐదు వికెట్లు దక్కాయి. షమీ, ఉమేష్‌, జ‌డేజా, యాద‌వ్‌లకు ఒక్కో వికెట్ ద‌క్కాయి. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ఓపెనర్లుగా క్రీజులోకి విజ‌య్‌, రాహుల్‌లు వచ్చారు. 

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments