Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌ను ఏకాకి చేద్ధాం : ఎహ్‌సాన్ మణి

అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌ను ఏకాకి చేద్దామని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మాజీ అధ్యక్షుడైన ఎహ్‌సాన్ మణి పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు పిలుపునిచ్చాడు. పాక్‌తో క్రికెట్ ఆడే ప్రసక్తే లేదని, క్రికెట్‌లో

Webdunia
గురువారం, 6 అక్టోబరు 2016 (09:13 IST)
అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌ను ఏకాకి చేద్దామని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మాజీ అధ్యక్షుడైన ఎహ్‌సాన్ మణి పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు పిలుపునిచ్చాడు. పాక్‌తో క్రికెట్ ఆడే ప్రసక్తే లేదని, క్రికెట్‌లో అయినా మరోచోటైనా భారత్‌దే విజయమన్న బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్‌ పాక్ మాజీ క్రికెటర్ జావెద్ మియాందాద్‌‌తో పాటు.. మణి కూడా వ్యాఖ్యలను తిప్పికొట్టారు. 
 
ఇదే అంశంపై మాట్లాడుతూ అనురాగ్ ఠాకూర్‌వి పరిపక్వత లేని వ్యాఖ్యలని, రెచ్చగొట్టే విధంగా ఉన్నాయన్నారు. ఐసీసీకి సంబంధించిన ఈవెంట్లను నిర్వహించకుండా భారత్‌ను ఏకాకిని చేసేవిధంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ చూడాలని కోరారు. వచ్చేవారం కేప్‌టౌన్‌లో జరగబోయే ఐసీసీ మీటింగ్‌లో భారత్‌ను ఏకి పారేసేందుకు, భారత్‌ను బహిష్కరించేందుకు పాక్ బోర్డ్ అధికారులు సిద్ధమై రావాలన్నారు. 
 
మరోవైపు... అధికార పార్టీ నాయకుడైన అనురాగ్ ఠాకూర్ బీసీసీఐ అధ్యక్షుడిగా పాక్‌పై వ్యాఖ్యలు చేశారా, లేక పార్టీ లీడర్‌గా అన్నారా అని ఐసీసీ నిలదీసేలా పీసీబీ (పాక్ క్రికెట్ బోర్డ్) గట్టి ప్రయత్నం చేయాలని కోరారు. రూల్స్ ప్రకారం ఐసీసీకి నష్టం కలిగించే విధంగా సొంత అధికారులు గానీ, సంబంధిత మెంబర్ అధికారులు కానీ ఎటువంటి కామెంట్స్ చేయకూడదని మణి గుర్తుచేశారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments