Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్‌కు డ్వేన్ బ్రావో రిటైర్మెంట్ - సీఎస్‌కేకు బౌలింగ్ కోచ్‌గా సేవలు

Webdunia
శుక్రవారం, 2 డిశెంబరు 2022 (17:22 IST)
వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రావో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు టాటా చెప్పేసారు. ఇకపై ఐపీఎల్ పోటీల్లో ఆడబోనని ఆయన ప్రకటించారు. అయితే, ఐపీఎల్ ఫ్రాంచైజీలలో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా సేవలు అందించనున్నట్టు ఆయన వెల్లడించారు. 
 
టీ20 టోర్నీలో అత్యధిక వికెట్ల (దాదాపు 600 వికెట్లు) పడగొట్టిన క్రికెటర్‌గా ఖ్యాతిగడించిన డ్వేన్ బ్రావో... వచ్చే సీజన్ నుంచి ఐపీఎల్‌కు దూరంకానున్నాడు. ప్రస్తుతం సీఎస్కే జట్టు తరపున సేవలు అందిస్తున్నాడు. అయితే, తమ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా సేవలు అందిస్తుందని సీఎస్కే జట్టు యాజమాన్యం తెలిపింది. దీనిపై డ్వేన్ బ్రావో స్పందించారు. 
 
"నేను ఈ కొత్త ప్రయాణం కోసం వేచి చూస్తున్నాను. ఎందుకంటే నా ఆట దాదాపుగా ముగిసిన తర్వాత నేను చేస్తున్న పని ఇది. బౌలర్లతో కలిసి పని చేయడాన్ని నేను ఆస్వాదిస్తాను. ఈ రోల్ పట్ల నేను ఎంతో ఉత్సాహంగా ఉన్నాను. ఆటగాడి నుంచి కోచ్ పాత్రకు మారడం అంటే సర్దుకుపోవాలనేమీ అనుకోవడం లేదు. ఎందుకంటే అటగాడిగాను తోటి బౌలర్లతో కలిసే పని చేశాను. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన వాడిగా నేను ఎప్పుడూ అనుకోలేదు. ఐపీఎల్‌లో భాగంగా ఉన్నందుకు సంతోషిస్తున్నాను" అని డ్వేన్ బ్రావో చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments