Webdunia - Bharat's app for daily news and videos

Install App

రహానేను ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు పంపితే మంచిది: ద్రవిడ్

Webdunia
శనివారం, 5 సెప్టెంబరు 2015 (12:34 IST)
టీమిండియా జట్టులో అజింక్యా రహానేను ఐదో నెంబర్‌లో బ్యాటింగ్‌కు పంపితే అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చునని గ్రేట్ వాల్ రాహుల్ ద్రవిడే తెలిపాడు. టీమిండియాలో నిలకడ ప్రదర్శించే రహానేను టెస్టుల్లో వన్ డౌన్‌‍లో బ్యాటింగ్ పంపడం సరైన నిర్ణయమని తాను భావించట్లేదన్నాడు. బెంగళూరులో రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ.. రహానేను ఐదో స్థానంలో లేకుంటే నాలుగో స్థానంలో పంపినా ఉపయోగం ఉంటుందని ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు. 
 
రహానేను టెస్టులో ఆ స్థానంలో బ్యాటింగ్‌కు పంపడం వల్ల టెయిలెండర్లతో మంచి స్కోరు రాబట్టవచ్చని తెలిపాడు. అప్పటికి రెండో కొత్త బంతిని బౌలర్లు తీసుకునే అవకాశం ఉండడంతో రహానే అయితే సమర్థవంతంగా ఎదుర్కొంటాడని ద్రవిడ్ వెల్లడించాడు. రహానే తనదైన శైలిలో సహజంగా బ్యాటింగ్‌తో అబ్బురపరుస్తాడని ద్రవిడ్ వ్యాఖ్యానించాడు. అలాగే టీమిండియా ప్లేయర్లు బ్రిలియంట్‌గా ఆడుతారని.. ప్రాక్టీస్‌లో చూశానని ద్రవిడ్ వ్యాఖ్యానించాడు.

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

తెలంగాణలో వర్షాలు.. అంటువ్యాధులతో జాగ్రత్త.. సూచనలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

Show comments