Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీసీసీఐ నుంచే ఐసీసీకి 80 శాతం ఆదాయం.. బీ కేర్ ఫుల్: రవిశాస్త్రి వార్నింగ్

బీసీసీఐ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్షోభ పరిస్థితుల నుంచి లబ్ధిపొందాలనుకుంటున్న వారికి మాజీ క్రికెటర్, ప్రస్తుత కామెంటేటర్ రవిశాస్త్రి వార్నింగ్ ఇచ్చారు. బీసీసీఐ పట్ల ఐసీసీ వ్యవహరిస్తున్న తీరుపై ఆయన మం

Webdunia
శుక్రవారం, 17 ఫిబ్రవరి 2017 (13:33 IST)
బీసీసీఐ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్షోభ పరిస్థితుల నుంచి లబ్ధిపొందాలనుకుంటున్న వారికి మాజీ క్రికెటర్, ప్రస్తుత కామెంటేటర్ రవిశాస్త్రి వార్నింగ్ ఇచ్చారు. బీసీసీఐ పట్ల ఐసీసీ వ్యవహరిస్తున్న తీరుపై ఆయన మండిపడ్డారు. ఐసీసీకి ఎక్కువ నిధులు బీసీసీఐ నుంచే వెళ్తున్నాయనే విషయాన్ని రవిశాస్త్రి గుర్తు చేశారు. అలాంటి బీసీసీఐకి పెద్ద మొత్తంలో షేర్ ఇచ్చేందుకు ఐసీసీ నిరాకరించడాన్ని రవిశాస్త్రి తప్పుపట్టారు.
 
అత్యధిక రెవెన్యూను అందించే బోర్డుగా, ఐసీసీ నుంచి తనకు రావాల్సిన ప్రతి పైసాను బీసీసీఐ డిమాండ్‌ చేయాలన్నాడు. ఐసీసీ టోర్నీలకు సంబంధించిన సుమారు 80 శాతం ఆదాయం భారత్ నుంచే వస్తుంది. అధిక వాటా అడుగుతున్నారు కాబట్టి భారత దౌర్జన్యం చేస్తుందని అంటున్నారా? అలాగైతే తన దృష్టిలో అంతకంటే చెత్త మరొకటి ఉండదని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. భారత నుంచి వచ్చే ఆదాయాన్ని మినహాయిస్తే.. ఎంత మిగులుతుందో చూడాలని ఉందని రవిశాస్త్రి అన్నాడు. 
 
బీసీసీఐలో అనిశ్చితి ఎక్కువ కాలం ఉండదు. అతిత్వరలో బీసీసీఐ మునుపటి ప్రభను సంతరించుకుంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా బోర్డులను ఉద్దేశించే రవిశాస్త్రి ఇలాంటి హెచ్చరికలు చేసినట్టుగా తెలుస్తోంది.

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments