Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాంపియన్స్ ట్రోఫీ : మనీష్ పాండేను తొలగించారు.. దినేష్ కార్తీక్‌ను చేర్చారు.. ఎందుకు?

ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీ (సీటీ)కి ఎంపికైన ఆనందం యువ బ్యాట్స్‌మన్ మనీష్‌ పాండేకు ఎంతో సమయం నిలువలేదు. గాయం కారణంగా అతను ఈ మెగాటోర్నీ నుంచి వైదొలిగాడు. అతని స్థానంలో 15 మందితో కూడిన భారత జట్టులో

Webdunia
శుక్రవారం, 19 మే 2017 (11:28 IST)
ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీ (సీటీ)కి ఎంపికైన ఆనందం యువ బ్యాట్స్‌మన్ మనీష్‌ పాండేకు ఎంతో సమయం నిలువలేదు. గాయం కారణంగా అతను ఈ మెగాటోర్నీ నుంచి వైదొలిగాడు. అతని స్థానంలో 15 మందితో కూడిన భారత జట్టులో దినేశ్ కార్తీక్‌ను ఎంపిక చేసినట్టు బీసీసీఐ గురువారం ప్రకటించింది. 
 
ఐపీఎల్‌లో కోల్‌కతా తరపున ఆడిన మనీష్‌ సన్ రైజర్స్‌తో ఎలిమినేటర్‌ మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్‌ సమయంలో పక్కటెముకల్లో నొప్పితో ఇబ్బంది పడ్డాడు. గాయం పెద్దది కావడంతో అతను సీటీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. పాండే భారత తరపు చివరగా ఈ ఏడాది జనవరిలో ఇంగ్లండ్‌తో రెండో టీ-20లో పాల్గొన్నాడు.
 
అయితే, గాయం కారణంగా మనీష్ పాండేను తొలగించి... తమిళనాడు వికెట్‌ కీపర్‌-బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తీక్‌కు చోటు కల్పించారు. ఐపీఎల్‌-10లో గుజరాత్ లయన్స్ తరపున అతను 14 మ్యచ్‌ల్లో 361 పరుగులతో సత్తాచాటాడు. అంతకుముందు విజయ్‌ హజారే ట్రోఫీ, దేవ్‌ధర్‌ ట్రోఫీ ఫైనల్స్‌లో సెంచరీలు చేసి మ్యాన్ ఆఫ్‌ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. దేశవాళీ సీజన్‌లో నిలకడగా రాణిస్తున్న దినేశను సెలెక్టర్లు జట్టులోకి తీసుకున్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతుండగా, తొలి మ్యాచ్‌ని జూన్ 4న పాకిస్థాన్‌తో ఆడాల్సి వుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

ఆ పూజారి కాలితో తన్నించుకుంటే మోక్షం కలుగుతుందట... ఎక్కడ?

మే నెలలో అమరావతిలో పర్యటించనున్న ప్రధాని మోడీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

తర్వాతి కథనం
Show comments