Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఇద్దరి మధ్యా ఆ బంధమున్నంత వరకు టీమిండియాకు తిరుగులేదట..!

అహంకారం ఏమాత్రం లేని, పరిణతికి మారుపేరుగా నిలిచిన ఇద్దరు దిగ్గజ క్రికెటర్ల మధ్య సరైన కెమిస్ట్రీ కుదిరితే అద్భుత ఫలితాలు వస్తాయని ఆ మేటి క్రికెటర్లు మరోసారి నిరూపించారు. ఇక మ్యాచ్ చేజారిపోయిందని ఆశలుడిగిన తరుణంలో తన అనుభవమంతా ఉపయోగించి ఒక వికెట్ కీపర్

Webdunia
బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (02:32 IST)
అహంకారం ఏమాత్రం లేని, పరిణతికి మారుపేరుగా నిలిచిన ఇద్దరు దిగ్గజ క్రికెటర్ల మధ్య సరైన కెమిస్ట్రీ కుదిరితే అద్భుత ఫలితాలు వస్తాయని ఆ మేటి క్రికెటర్లు మరోసారి నిరూపించారు. ఇక మ్యాచ్ చేజారిపోయిందని ఆశలుడిగిన తరుణంలో తన అనుభవమంతా ఉపయోగించి ఒక వికెట్ కీపర్ తాత్కాలికంగా కెప్టెన్ బాధ్యతలు స్వీకరించిన క్షణంలోనే ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 రెండో మ్యాచ్‌లో భారత్ విజయాన్ని తన పేరిట లిఖించుకుంది. ధోనీ చివరి రెండు ఓవర్లలో సారధిగా మారిపోయి ఫీల్డింగ్ సెట్ చేస్తున్న తరుణంలో కోహ్లీ లాంగాన్‌లో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తూ ధోనీకి బాధ్యతలు వదిలేయడం ఎవరూ తప్పుపట్టలేదు. పైగా ఆ ఇద్దరి మధ్య అలాంటి సాన్నిహిత్యం, అహాలను దూరంపెట్టిన వ్యక్తిత్వం ఇదేవిధంగా కొనసాగాలని యావత్ క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.
 
ఇంగ్లండ్‌తో రెండో మ్యాచ్ లోనే అనికాదు.. ధోనీ కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పుకున్న తర్వాత కోహ్లీ నాయకత్వ బాధ్యతలు స్వీకరించడం వాస్తవమే కావచ్చు కానీ మ్యాచ్‌‌ ఉత్కంఠ స్థితికి చేరుకుంటున్న ప్రతి సందర్భంలోనూ ధోనీ కెప్టెన్‌గా మారిపోతున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో చివరి రెండు ఓవర్లలో 24 పరుగులు చేయాల్సిన సమయంలో ధోనీ తన అనుభవాన్ని ఉపయోగించాడు. సారధిగా మారిపోయి ఫీల్డింగ్ సెట్ చేశాడు. అటు నెహ్రా, ఇటు బూమ్రాలతో మాట్లాడుతూ పలు సూచనలిస్తూ కనిపించాడు. 
 
ఆ సమయంలో అసలు కెప్టెన్ కోహ్లీ లాంగాన్‌లో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నాడు. అయితే ఒత్తిడి ఎక్కువగా ఉండే చివరి ఓవర్లలో తనకున్న అనుభవం మొత్తాన్ని ఉపయోగిస్తుండటంతో కోహ్లీ కూడా ధోనీకి మద్దతుగా కొంత సైలెంట్ అయిపోతున్నాడు. తనకు ధోనీనే ఎప్పుడూ కెప్టెన్ అని కోహ్లీ గతంలో అన్నాడు. అదేవిధంగా కోహ్లీకి తాను సహకరిస్తానని ధోనీ చెప్పిన సంగతి తెలిసిందే.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్

IMD: హిమాచల్ ప్రదేశ్‌లో జూలై 6న అతి భారీ వర్షపాతం- రెడ్ అలెర్ట్ జారీ

ఫ్లైఓవర్‌పై ఫోటో షూట్ పేరుతో యువకులు హల్ చల్- డ్రోన్ కనిపించడంతో పరుగులు (video)

Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి: జగన్మోహన్ రెడ్డి డిమాండ్

బీహార్‌‌లో గోపాల్ ఖేమ్కా హత్య.. కారులో దిగుతుండగానే కాల్చి చంపేశారు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sathya: భకాసుర టైటిల్‌ ర్యాప్‌ సాంగ్‌ను ఆవిష్కరించిన అనిల్ రావిపూడి

సుహాస్‌, మాళవిక మనోజ్ నటించిన ఓ భామ అయ్యో రామ ట్రైలర్‌

Varun Tej: వరుణ్ తేజ్ 15 వ చిత్రం విదేశాల్లో షూటింగ్

Kartik Aaryan- Sreeleela: కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల ప్రేమాయణం? డిన్నర్‌కు? (video)

రామాయణం: సీత పాత్రకు సాయి పల్లవి యాప్ట్ కాదంటోన్న నెటిజన్లు.. ట్రోల్స్ మొదలు

తర్వాతి కథనం
Show comments