Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియాకు విజయం అంత సులువు కాదు : మైఖేల్ వాన్

Webdunia
బుధవారం, 25 మార్చి 2015 (10:16 IST)
సొంత మైదానం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో భారత్‌తో తలపడే ఆస్ట్రేలియాకు విజయం అంత సులభం కాబోదని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ అభిప్రాయపడ్డారు. వరల్డ్ కప్ 2015 రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కొనే అంశంపై ఆస్ట్రేలియా విజయావకాశాలు ఆధారపడి ఉంటాయని చెప్పుకొచ్చాడు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ సెమీస్‌లో టీమిండియా స్పిన్‌ను ఏ మేరకు ఎదుర్కొంటుందన్న దానిపైనే ఆసీస్ విజయం ఆధారపడి ఉంటుందని అతడు వ్యాఖ్యానించాడు. ఇకపోతే.. టీమిండియా సారథి మహేంద్ర సింగ్ ధోనీపై వాన్ ప్రశంసల జల్లు కురిపించాడు. వరల్డ్ కప్‌లో విజయాలు ఎలా సాధించాలో ధోనీకి బాగా తెలుసన్న వాన్, టీమిండియాను ధోనీ మలిచిన తీరు అద్భుతమంటూ కీర్తించాడు. 
 
ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు, వన్డే సిరీస్‌ల తర్వాత టీమిండియాను ధోనీ దుర్బేధ్యంగా మలిచాడని వాన్ పేర్కొన్నాడు. ఆ కారణంగానే వరల్డ్ కప్‌లో టీమిండియా జైత్ర యాత్ర కొనసాగిస్తోందని వ్యాఖ్యానించాడు. తనదైన టెక్నిక్‌తో రాణిస్తున్న భారత బ్యాట్స్ మన్ అజింక్యా రెహానే, భవిష్యత్‌లో టీమిండియా బ్యాటింగ్‌కు వెన్నెముకలా మారతాడని వాన్ చెప్పాడు. 

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

Show comments