Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీసీసీఐ కొత్త కార్యదర్శిగా దేవ్‌జిత్ సైకియా

ఠాగూర్
ఆదివారం, 5 జనవరి 2025 (09:04 IST)
భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కొత్త కార్యదర్శిగా దేవ్‌జిత్ సైకియా ఎంపికకానున్నారు. ఈ పోస్టుల దరఖాస్తుల దాఖలు ప్రక్రియ శనివారం సాయంత్రంతో ముగియగా, ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. అయితే, ఈ విషయాన్ని మాత్రం ఈ నెల 12వ తేదీన జరిగే బీసీసీఐ సర్వసభ్య సమావేశంలో అధికారికంగా ప్రకటిస్తారు. 
 
ఈ నెల 12వ తేదీన ముంబైలో బీసీసీఐ సర్వసభ్య సమావేశంలో బీసీసీఐ కార్యదర్శి, కోశాధికారి పదవులకు ఎన్నిక జరగనున్న నేపథ్యంలో నామినేషన్ల దాఖలు ప్రక్రియ శనివారంతో ముగిసింది. కార్యదర్శి పదవికి ప్రస్తుత తాత్కాలిక కార్యదర్శిగా ఉన్న దేవ్‌జిత్ సైకియా (అస్సాం), కోశాధికారి పదవి కోసం ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ప్రభతేజ్‍‌లు నామినేషన్లు దాఖలు చేశారు.
 
శనివారం సాయంత్రం నామినేషన్ల స్వీకరణ ముగిసే సమయానికి వీరిద్దరే నామినేషన్లు దాఖలు చేయడంతో వీరు ఇద్దరూ ఆయా పదవులకు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం లాంఛనప్రాయమైంది. 12వ తేదీన జరిగే బీసీసీఐ సర్వసభ్య సమావేశంలో ఎన్నికల అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అచల్ కుమార్ జ్యోతి వీరిరువురి ఎన్నికను అధికారికంగా ప్రకటించనున్నారు.
 
ఇటీవలి కాలం వరకూ బీసీసీఐ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన జై షా ఐసీసీ చైర్మన్‌గా ఎన్నిక అవ్వడం, బీసీసీఐ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన అశిష్ షెలార్ మహారాష్ట్రలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో కార్యదర్శి, కోశాధికారి ఎన్నికల ప్రక్రియను బీసీసీఐ చేపట్టింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వీడు సామాన్యుడు కాదు.. అసాధ్యుడు.. నాలుకతో ఫ్యాన్ రెక్కలను... (Video)

కేసీఆర్ ఫ్యామిలీ వెయ్యేళ్లు జైలుశిక్ష అనుభవించాలి : సీఎం రేవంత్ రెడ్డి (Video)

జనసేన పార్టీకి ఇంధనం దిల్ రాజు, నా బంగారం రామ్ చరణ్: డిప్యూటీ సీఎం పవన్

మకర సంక్రాంతికి ఏపీలో జగన్మోహన్ రెడ్డి వుండరా?

Telangana : తెలంగాణలో ఎటువంటి కేసులు లేవు - HMPVపై భయం వద్దు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'డాకు మహారాజ్‌' మనందరి సినిమా.. ఆదరించండి : నిర్మాత నాగవంశీ

పవన్ కళ్యాణ్ వున్నా, రామ్ చరణ్ వున్నా మూలాలు చిరంజీవిగారే: పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్

తండేల్ నుంచి శివ శక్తి సాంగ్ నమో నమః శివాయ రిలీజ్

విజయ్ కనిష్క హీరోగా చదలవాడ శ్రీనివాసరావు, సి కళ్యాణ్ ప్రారంభించిన కలవరం సినిమా

వెంకటేష్ గారు పాడడం.. సినిమాకు పనిచేయడం నాకు కలగా వుంది : భీమ్స్ సిసిరోలియో

తర్వాతి కథనం