Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్తాన్‌తో నో క్రికెట్... దావూద్‌కు ఆశ్రయం ఇవ్వడం మానుకుంటేనే... బీసీసీఐ

Webdunia
శనివారం, 22 ఆగస్టు 2015 (22:14 IST)
ముంబయి వరుస పేలుళ్ల నిందితుడు, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు ఆశ్రయం ఇస్తూనే పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడుతుందని ఎలా ఆశిస్తారని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించారు. దావూద్ ఇబ్రహీంకు ఆశ్రయం ఇవ్వడం నిలిపివేసే వరకు పాక్ తో క్రికెట్ సంబంధాల పునరుద్ధరణ ఉండదని తెగేసి చెప్పారు. 
 
ఇరు దేశాల మధ్య చర్చల్లో వేర్పాటువాదులకు చోటు కల్పించే ప్రయత్నాలు కూడా మానుకోవాలని స్పష్టం చేశారు. అప్పుడే భారత్, పాక్ క్రికెట్ సంబంధాలపై ఆలోచిస్తామని అన్నారు. దావూద్ ఏమో కరాచీలోనే ఉన్నాడు. ఎన్ఎస్ఏ వేర్పాటువాదులను కలవాలని కోరుకుంటున్నారు. 
 
మీరు నిజంగానే శాంతి కోసం పాటుపడుతున్నారా? మీతో క్రికెట్ ఆడతామని ఆశిస్తున్నారా ?అని ట్వీట్ చేశారు. ఆటలు శాంతి, సామరస్యాలకు నిదర్శనాలని వాటిని అలాంటి సమయంలో మాత్రమే ఆడాలని అన్నారు. అయితే పాకిస్తాన్ ఇలా వ్యవహరిస్తుంటే క్రికెట్ ఆడడం సాధ్యం కాదని చెప్పారు. 

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

Show comments