Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీని ధోనీనే నడిపిస్తున్నాడు... : డేవిడ్ వార్నర్

భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీని మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీనే నడిపిస్తున్నాడని ఆసీస్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ అన్నాడు. ఇదే అంశంపై వార్నర్‌ మాట్లాడుతూ కోహ్లీ - ధోనీ కలిసి భారత జట్టు విజ

Webdunia
శనివారం, 23 సెప్టెంబరు 2017 (07:23 IST)
భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీని మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీనే నడిపిస్తున్నాడని ఆసీస్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ అన్నాడు. ఇదే అంశంపై వార్నర్‌ మాట్లాడుతూ కోహ్లీ - ధోనీ కలిసి భారత జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. మరీ ముఖ్యంగా ధోనీ.. కోహ్లీకి విలువైన సూచనలు, సలహాలు ఇస్తూ విజయపథంలో నడిపిస్తున్నాడు’ అని చెప్పుకొచ్చాడు. 
 
ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ అనంతరం వెస్టిండీస్‌, శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌ల్లో భారత్‌ విజయం సాధించింది. ఆస్ట్రేలియాతో మరో వన్డే గెలిస్తే ఐదు వన్డేల సిరీస్‌ కూడా భారత్‌ వశం కానుంది. దీనిపై వార్నర్‌ మాట్లాడుతూ, ధోనీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు నిశబ్ధంగా తన పని తాను చేసుకుపోయేవాడన్నారు. 
 
కెప్టెన్‌ జాబ్‌కి అతడు పూర్తి న్యాయం చేశాడు. ఆ బాధ్యతల నుంచి బయటికి వచ్చినప్పటికీ అతడు జట్టు విజయాల కోసం తాపత్రయపడుతున్నాడు. కోహ్లీని ధోనీనే నడిపిస్తున్నాడు. ఈ కలయికే భారత క్రికెట్‌ జట్టుకి అద్భుత విజయాలు అందిస్తోంది’ అని తెలిపాడు. సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య మూడో వన్డే ఆదివారం ఇండోర్‌లో జరగనుంది. 

జూన్ 4న ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి దేశం ఉలిక్కిపడుతుంది: వైఎస్ జగన్

డిబిటి పథకాల కింద నిధుల విడుదలకు ఈసీ గ్రీన్ సిగ్నల్

గృహనిర్భంధంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్‌బాబు

41 మందులపై ధరలను తగ్గించిన ప్రభుత్వం

పవన్ మ్యాన్ ఆఫ్ ది మూమెంట్.. కొత్త శక్తి.. లగడపాటి శ్రీధర్

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

తర్వాతి కథనం
Show comments