Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2024 : చెన్నై వైపు ఏకపక్షంగా సాగిన మ్యాచ్!! 63 పరుగులతో విజయం

వరుణ్
బుధవారం, 27 మార్చి 2024 (10:22 IST)
ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా, మంగళవారం చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఏకపక్షంగా జరిగింది. ఈ మ్యాచ్‌లో 63 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. గుజరాత్ టైటాన్స్ జట్టు చిత్తుగా ఓడిపోయింది. ఈ మ్యాచ్‌ వైపు ఏకపక్షంగా ఈ మ్యాచ్ జరిగింది. 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన శివమ్ దూబైకి దక్కిన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దక్కించుకుంది. బ్యాటింగ్, బౌలింగ్లలో చెన్నై ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేయడంతో మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. అయితే భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ బ్యాటర్లు చేతులెత్తేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 143 పరుగులు మాత్రమే చేశారు.
 
ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే కెప్టెన్ శుభమాన్ గిల్(8)ను చెన్నై పేసర్ దీపక్ చాహర్ ఔట్ చేశాడు. ఆ తర్వాత 5వ ఓవర్లో మరో ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (21)ను కూడా చాహర్ పెవిలియన్‌కు పంపించాడు. ఇక క్రీజులో పాతుకుపోయినట్టే కనిపించిన సాయి సుదర్శన్ కూడా వ్యక్తిగత స్కోరు 37 పరుగుల వద్ద నిష్క్రమించాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లలో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. దీంతో గుజరాత్ టైటాన్స్ భారీ ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, తుషార్ దేశ్ పాండే తలో రెండు వికెట్లు, డారిల్ మిచెల్, మతీష పతిరణ చెరో వికెట్ తీశారు.
 
ఈ మ్యాచ్ 63 పరుగుల తేడాతో ఓడిన గుజరాత్ టైటాన్స్‌కి ఐపీఎల్ హిస్టరీలో ఇదే అతిపెద్ద ఓటమి. గత సీజన్‌లో ముంబై ఇండియన్స్‌పై 27 పరుగులతో చవిచూసిన ఓటమి అతిపెద్దదిగా ఉండగా ఆ రికార్డు ఈ మ్యాచ్ బ్రేక్ అయ్యింది. ఇక టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన చెన్నై సూపర్ బ్యాటర్లు చెలరేగి ఆడారు. ఫోర్లు, సిక్సర్లతో గుజరాత్ టైటాన్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాయి. ఓపెనర్లు రచిన్ రవీంద్ర (46), రుతురాజ్ గైక్వాడ్ (46)తో పాటు శివమ్ దూబే (51) అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడారు. 
 
ముఖ్యంగా శివమ్ దూబే 21 బంతుల్లోనే అర్థశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో 5 సిక్సర్లు, 2 ఫోర్లు ఉన్నాయి. దీంతో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు శివమ్ దూబేకి దక్కింది. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టగా సాయి కిశోర్, స్పెన్సర్ జాన్సన్, మొహిత్ శర్మ తలో వికెట్ తీశారు. మరో వికెట్ రనౌట్ రూపంలో దక్కింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

పెద్దిరెడ్డి పక్కకుపోతే.. పవన్‌తో చేతులు కలిపిన బొత్స -వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

తర్వాతి కథనం
Show comments