మద్యం మత్తులో భార్యపై కుకింగ్ పాన్‌‍తో దాడి.. వినోద్ కాంబ్లీపై కేసు

Webdunia
ఆదివారం, 5 ఫిబ్రవరి 2023 (14:18 IST)
భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీపై పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు. మద్యం మత్తులో ఆయన భార్యపై దాడి చేసినందుకు ఈ కేసు నమోదు చేశారు. కాంబ్లీ భార్య ఆండ్రియా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తనను దుర్భాషలాడటంతోపాటు దాడికి పాల్పడినట్లు కాంబ్లీపై ఆండ్రియా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ముంబై పోలీసులు పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
ఆండ్రియా తలకు గాయం కావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో తనపై దాడి చేశాడని కాంబ్లీ భార్య ఫిర్యాదు చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. అయితే, వినోద్ కాంబ్లీని అదుపులోకి తీసుకోలేదు. ఫిర్యాదులో పేర్కొన్నదానిని బట్టి.. కుకింగ్‌ పాన్‌ను విసిరి కొట్టడంతో కాంబ్లీ భార్య తలకు దెబ్బ తగలిగిందని అధికారులు వెల్లడించారు.
 
శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో మద్యం తాగి వచ్చిన కాంబ్లీ విపరీతంగా దుర్భాషలాడుతూ ఆమెపై దాడి చేసినట్లు తెలిపారు. కాంబ్లీ భార్య ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్‌ 324, ఐపీసీ సెక్షన్ 504 ప్రకారం కేసులు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు పోలీసులు వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విమానంలో ప్రయాణించే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ (video)

సంతోషంగా పెళ్లి చేసుకుని జీవిస్తున్న దంపతులను వేధించడమా? హైకోర్టు ప్రశ్న

17వ వార్షిక రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్

ప్రియురాలి కోసం లండన్ నుంచి వచ్చిన ప్రియుడు.. చివరకు విగతజీవిగా మారాడు.. ఎలా?

Amaravati: అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్ట్ ప్రారంభానికి రెండేళ్లు పట్టే అవకాశం..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

మంచి ప్రేమ కథతో వస్తున్న లవ్ డేస్ పెద్ద విజయం సాధించాలి : సముద్ర

తర్వాతి కథనం
Show comments