Webdunia - Bharat's app for daily news and videos

Install App

షమీ తన భార్య ఫోటోను అలా పెట్టడం తప్పా? నీ భార్యకు బురఖా ఎందుకెయ్యలేదు?(ఫోటోలు)

భారత పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ పోస్ట్ చేసిన ఫోటోలపై ఇపుడు చర్చ జరుగుతోంది. తన భార్య హసిన్ జహాన్‌తో కలిసి దిగిన ఓ ఫోటోను సరదాగా ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశాడు. అందులో హసిన్ జహాన్ స్లీవ్‌లస్ గౌను ధరించింది. ఇంకేముంది కొంతమంది నెటిజన్లు రెచ్చిపోయారు. షమీ నువ్

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2016 (13:57 IST)
భారత పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ పోస్ట్ చేసిన ఫోటోలపై ఇపుడు చర్చ జరుగుతోంది. తన భార్య హసిన్ జహాన్‌తో కలిసి దిగిన ఓ ఫోటోను సరదాగా ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశాడు. అందులో హసిన్ జహాన్ స్లీవ్‌లస్ గౌను ధరించింది. ఇంకేముంది కొంతమంది నెటిజన్లు రెచ్చిపోయారు. షమీ నువ్వు అసలైన ముస్లింవేనా అంటూ కామెంట్ల వర్షం కురిపించారు. విమర్శలు గుప్పించారు. అయితే మరికొందరు ముస్లింలు షమీకి అండగా నిలిచారు. 
 
వీరిలో సీనియర్ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ కూడా ఉన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చాలా సిగ్గుపడేలా ఉన్నాయని.. మొహమ్మద్ షమీకి తన మద్దతు ఉంటుంది. దేశంలో చాలా సమస్యలున్నాయని.. తాను చెప్పదలచుకున్నది అర్థమయ్యే ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపాడు. ట్విట్టర్, ఫేస్బుక్ పేజీలో ఫోటోలను షమీ పోస్ట్ చేసినా, రెండింట్లో విభిన్నంగా కామెంట్లు వచ్చాయి. ఫేస్ బుక్లో ఎక్కువగా దుస్తులకు వ్యతిరేకంగా కామెంట్లు వస్తే ట్విట్టర్లో మాత్రం ఫోటోలు బాగున్నాయంటూ, ఇండియన్ ముస్లింలు మీలాగే ఉండాలని భావిస్తున్నామంటూ.. ఎక్కువగా కామెంట్లు రావడం గమనార్హం.
 
అయితేఇలాంటి వ్యాఖ్యలు చాలా సిగ్గుపడేలా ఉన్నాయి.  మొహమ్మద్ షమీకి నా మద్దతు ఉంటుంది. దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. తాను చెప్పదలచుకున్నది అర్థమయ్యి ఉంటుందని భావిస్తున్నానని మొహమ్మద్ కైఫ్ తెలిపాడు. ఎవరి ఇష్టం వచ్చిన దుస్తులు వారు ధరిస్తారని మీ పని మీరు చూసుకోండంటూ దుస్తులపై కామెంట్లు చేసిన వారిపై నెటిజన్లు షమీకి బాసటగా నిలిచారు.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

తర్వాతి కథనం
Show comments