బంగ్లాదేశ్ క్రికెటర్ అరాఫత్ మళ్లీ అరెస్ట్ అవుతాడట..

బంగ్లాదేశ్ క్రికెటర్ అరాఫత్ సన్నీ మరోసారి అరెస్ట్ కానున్నట్లు సమాచారం. భార్యను కట్నం కోసం వేధింపులకు గురిచేసిన కారణంతో అతను అరెస్ట్ అయ్యే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. 2014

Webdunia
శనివారం, 14 అక్టోబరు 2017 (08:40 IST)
బంగ్లాదేశ్ క్రికెటర్ అరాఫత్ సన్నీ మరోసారి అరెస్ట్ కానున్నట్లు సమాచారం. భార్యను కట్నం కోసం వేధింపులకు గురిచేసిన కారణంతో అతను అరెస్ట్ అయ్యే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. 2014 డిసెంబర్ 4న నస్రీన్ సుల్తానాతో అరాఫత్ సన్నీకి వివాహమైంది. నస్రీన్ సుల్తానా తల్లిదండ్రుల వరకట్నంగా బంగ్లా కరెన్సీలో 5.1 లక్షల టాకాలను ఇచ్చారు. 
 
కానీ ప్రస్తుతం అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు. రూ.20 లక్షల టాకాలు తీసుకురావాలని సన్నీ, అతని తల్లి ఆమెను వేధించడం ఆరంభించారు. దీంతో ఆమె ఈ ఏడాది జనవరి 5న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు అదేనెల 22న అతనిని అరెస్టు చేశారు. అనంతరం వివాదం పరిష్కరించుకున్నామని చెప్పడంతో మార్చిలో అతనిని బెయిల్‌పై విడుదల చేశారు. 
 
అయినా అతనిలో మార్పు రాకపోవడంతో మరోసారి జూలై 16న అతనిని అరెస్ట్ చేశారు. ఆ సమయంలో సన్నీకి జైలులో చికున్ గున్యా వ్యాధి రావడంతో మళ్లీ బెయిల్‌పై విడుదలయ్యాడు. తాజాగా మరోసారి అవే ఆరోపణలు రావడంతో అక్టోబర్‌ 12న ఈ కేసును పోలీసులు రీఓపెన్‌ చేశారు. ఈసారి కూడా అరాఫత్ సన్నీ జైలుకెళ్లడం ఖాయమని సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అలాంటి గర్ల్ కావాలంటే గంటకు రూ. 7500, సెక్స్ రాకెట్ పైన పోలీసుల దాడి

సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదంలో మృతులంతా హైదరాబాదీయులే : హజ్ కమిటీ వెల్లడి

నేను బతికే ఉన్నాను.. ఉంటాను... షేక్ హసీనా

రాజకీయాల్లోకి వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్, ఏ పార్టీలో చేరుతారు?

అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌కు కాదు.. నవీన్ యాదవ్‌కే మద్దతు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

హైదరాబాద్ సీపీ సజ్జనార్‌పై పవన్ కళ్యాణ్ ప్రశంసలు.. ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments