Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరబ్ ఎమిరేట్స్‌‌పై ఐర్లాండ్ విజయం: కెవిన్ ఒబ్రెయిన్ జోరుతో విన్

Webdunia
శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (13:15 IST)
ప్రపంచ కప్‌ గ్రూప్‌ బిలో భాగంగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్‌ విజయం సాధించింది. కాగా 49.2 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన ఐర్లాండ్‌ 279 పరుగులు సాధించి టోర్నీలో వరుసగా రెండవ విజయాన్ని సాధించింది. మిడిల్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఐరిష్‌ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ కెవిస్‌ ఒబ్రెయిన్‌ మరోసారి విజృంభించాడు. 
 
కాగా 25 బంతులు ఆడి 8 బౌండరీలు,2 సిక్సర్లతో 50 పరుగులు చేసిన కెవిస్‌ జావెద్‌ విసిరిన 45 ఓవర్‌లో సబ్‌స్ట్యూట్‌ ఫీల్డర్‌ హైదర్‌కు సునాయాస క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ దారి పట్టాడు. ఒక దశలో ఒక్కో ఓవర్‌కు 15 చేయాల్సి ఉండగా కెవిస్‌ జోరుతో రిక్వైర్డ్‌ రన్‌రేట్‌ అదుపులోకి వచ్చింది. దీంతో విజయ లాంఛనాన్ని విల్సన్‌, మూనీ, అలెక్స్‌ కౌసాక్‌ పూర్తి చేశారు.
 
యుఎఇ 279 పరుగులు టార్గెట్‌ను ఐర్లాండ్‌ 2 వికెట్ల సాయంతో మరో నాలుగు బంతులు మిగిలుండానే ఛేదించింది. ఐరిష్‌ వికెట్‌ కీపర్‌ విల్సన్‌ బాధ్యతాయుతంగా ఆడి 69 బంతులలో 80 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ 48 ఓవర్లలో నవీద్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో మ్యాచ్‌ మరింత రసవత్తరంగా మారింది. ఒత్తిడిని తట్టుకుని ఐర్లాండ్‌ టెయిల్‌ ఎండర్‌లు జాగ్రత్తగా బ్యాటింగ్‌ చేయడంతో చివరికి ఐర్లాండ్‌ విజయం సాధించింది. 
 
షైమన్‌ అన్వర్‌ 106 పరుగులు చేయడంతో యుఎఇ 279 పరుగులు టార్గెట్‌ ఐర్లాండ్‌కు నిర్ధేశించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన యుఎఇ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 278 పరుగులు చేసింది. అన్వర్‌ సెంచరీకి తోడు అజాంద్‌ అలీ 45 పరుగులు, అంజాద్‌ జావేద్‌ 42 పరుగులు ఖుర్రం ఖాన్‌ 36 పరుగులతో బాగా ఆడారు. దీంతో గ్రూపు బిలో జరగబోయే మ్యాచ్‌లన్నీ ఆసక్తికర పరిస్థితి కనిపిస్తుంది.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments