Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఊపిరి పీల్చుకున్న భారత జట్టు ... వారందరికీ నెగెటివ్

Webdunia
శుక్రవారం, 16 జులై 2021 (14:20 IST)
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత్ క్రికెట్టులో వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మిగిలిన వారందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో వారందరికీ నెగెటివ్ అని వచ్చింది. దీంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. 
 
కాగా, గురువారం నాడు వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ కరోనా పాజిటివ్ బారిన పడటంతో అతడితో కాంటాక్ట్ అయిన క్రికెటర్లకు కరోనా భయం పట్టుకుంది. దీంతో టీమ్ మేనేజ్‌మెంట్ కరోనా పరీక్షలు నిర్వహించింది. అయితే వారందరికీ నెగిటివ్‌గా నిర్ధారణ కావడంతో జట్టు యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది.
 
రిషబ్ పంత్‌తో పాటు అతడికి త్రోలు విసిరే దయానంద్ అనే వ్యక్తికి కూడా కరోనా పాజిటివ్ రావడంతో ప్రస్తుతం వీళ్లిద్దరూ ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరితో సన్నిహితంగా ఉన్న వృద్ధిమాన్ సాహా, యువ క్రికెటర్ అభిమన్యు ఈశ్వరన్, కోచ్ భరత్ అరుణ్‌ను కూడా ఐసోలేషన్‌కు పంపించారు. 
 
మిగిలిన క్రికెటర్లు డుర్హమ్‌లోని శిక్షణ శిబిరానికి తరలివెళ్లారు. గురువారం కోహ్లీ సేనకు ఆర్టీపీసీఆర్ కరోనా టెస్టులు చేయగా అందరికీ నెగిటివ్ వచ్చినట్లు బీసీసీఐ వెల్లడించింది. ప్రస్తుతం పంత్ బాగున్నాడని, మరో 7 రోజులు అతడు ఐసోలేషన్‌లోనే ఉంటాడని జట్టు వర్గాలు తెలిపాయి.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments