Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్‌లో మరోకోణం.. 'పాపకు ప్రేమతో' పాలు పట్టిన గేల్

వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్. మైదానంలో బ్యాటుతో వీరవిహారం చేసే గేల్... మైదానం వెలుపల మాత్రం అమ్మాయిలతో జల్సాలు, అసభ్యకరమైన కామెంట్లు చేస్తూ వివాదాస్పద క్రికెటర్‌గా అప్రతిష్ట మూటగట్టుకున్నాడు.

Webdunia
బుధవారం, 3 ఆగస్టు 2016 (15:19 IST)
వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్. మైదానంలో బ్యాటుతో వీరవిహారం చేసే గేల్... మైదానం వెలుపల మాత్రం అమ్మాయిలతో జల్సాలు, అసభ్యకరమైన కామెంట్లు చేస్తూ వివాదాస్పద క్రికెటర్‌గా అప్రతిష్ట మూటగట్టుకున్నాడు. అయితే, గేల్‌లో మరో కోణం కూడా ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం 'ఇన్ స్టాగ్రాం'లో ప్రత్యక్షమైన ఓ ఫొటో చూస్తే గేల్‌లో ఉండే ఈ కోణం ఏంటో ఇట్టే అర్థమైపోతుంది.
 
అయితే ఇటీవలే క్రిస్ గేల్ భార్య ఓ పండంటి పాపకు జన్మనిచ్చింది. ఆ పాపకు 'బ్లష్' అని పేరు పెట్టుకున్న గేల్... బోసి నవ్వుల పాపను చూసి సంబరపడిపోతున్నాడు. పాప రాకతో తండ్రిగా మారిపోయిన గేల్‌లో ఒక్కసారిగా పెద్ద మార్పే వచ్చినట్టు కనిపిస్తోంది. కూతురుతో కాలక్షేపం చేసేందుకు అతడు ప్రస్తుతం భారత్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌కు కూడా దూరంగా ఉంటున్నాడు. 
 
ప్రస్తుతం ఇంటి పట్టునే ఉంటున్న గేల్... ముద్దులొలికే కూతురికి పాలు పడుతున్నాడట. ఇలా పాపకు పాలు పడుతున్న ఫొటోను క్లిక్ మనిపించుకున్న గేల్... దానిని ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేశాడు. గేల్‌లోని కొత్త కోణాన్ని చూసిన నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారట. ప్రస్తుతం ఈఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్రమ సంబంధం బయటపడుతుందని ప్రియుడితో జతకట్టి భర్తను మట్టుబెట్టిన భార్య!!

పోప్ నివాళి కోసం వాటికన్ సిటీకి వెళ్లిన రాష్ట్రపతి బృందం!!

రాజకీయ క్రినీడలో బలైపోయాను : దువ్వాడ శ్రీనివాస్ నిర్వేదం

మాజీ మంత్రి పెద్దిరెడ్డి మెడకు బిగుస్తున్న ఉచ్చు.. కీలక అనుచరుడు అరెస్టు!!

Pawan Kalyan: పహల్గామ్‌ మృతుడు మధుసూధన్ రావుకు పవన్ నివాళులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

తర్వాతి కథనం
Show comments