Webdunia - Bharat's app for daily news and videos

Install App

500 సిక్సర్ల వీరుడు.. ఎవరు...

Webdunia
గురువారం, 28 ఫిబ్రవరి 2019 (11:19 IST)
వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్. ఏ పని చేసినా అది సంచలనమే అవుతుంది. బ్యాట్ పట్టుకుని క్రీజ్‌లోకి వచ్చినా.. లేదా పబ్బులు, క్లబ్బుల్లో తిరిగినా అది మీడియాకు ఓ మంచి వార్త. తాజాగా క్రిస్ గేల్ మరోమారు మీడియా దృష్టిని ఆకర్షించాడు. వ‌న్డేల్లో ప‌దివేల ప‌రుగుల మైలురాయిని దాటేశాడు. 
 
సెయింట్ జార్జ్‌లో ఇంగ్లండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో గేల్ 162 ర‌న్స్ చేశాడు. గేల్‌కు ఇది 25వ వ‌న్డే సెంచ‌రీ కాగా, 39 ఏళ్ల గేల్ అంత‌ర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మెట్లలో కలుపుకుని 500 సిక్స‌ర్లు కొట్టిన ప్లేయ‌ర్‌గా కూడా రికార్డు క్రియేట్ చేశాడు. 
 
అలాగే, వ‌న్డేల్లో ప‌దివేల ప‌రుగుల మైలురాయిని దాటిన 14వ బ్యాట్స్‌మెన్‌గా చ‌రిత్ర‌కెక్కాడు. ఈ ఘ‌ట‌న సాధించిన రెండో వెస్టిండీస్ క్రికెట్ ఆటగాడిగా గేల్ నిలిచాడు. గతంలో వ‌న్డేల్లో ప‌ది వేల ప‌రుగుల చేసిన ప్లేయ‌ర్ల‌లో బ్రియాన్ లారా ముందు వరుసలో ఉన్నాడు. కాగా, త్వరలో జరుగనున్న ప్రపంచ క్రికెట్ కప్ తర్వాత క్రిస్ గేల్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నాడు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments