Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా క్రికెట్లో మెరుస్తున్న మణి దీపం స్మృతి మంధన

భారత మహిళా క్రికెట్‌ జట్టు ఓపెనర్‌ స్మృతి మంధన పేరు ఇప్పుడు మార్మోగుతోంది. ఇటీవల వరల్డ్‌ కప్‌లో సెంచరీ బాదిన ఈ అమ్మాయిని భారత లెజండ్ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ సైతం ప్రశంసల్లో ముంచెత్తారు.. స్మృతి చిన్నప్పుడు తన ఫేవరెట్‌ క్రికెటర్‌ కుమార సంగక్కరను తె

Webdunia
మంగళవారం, 4 జులై 2017 (02:55 IST)
భారత మహిళా క్రికెట్‌ జట్టు ఓపెనర్‌ స్మృతి మంధన పేరు ఇప్పుడు మార్మోగుతోంది. ఇటీవల వరల్డ్‌ కప్‌లో సెంచరీ బాదిన ఈ అమ్మాయిని భారత లెజండ్ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ సైతం ప్రశంసల్లో ముంచెత్తారు.. స్మృతి చిన్నప్పుడు తన ఫేవరెట్‌ క్రికెటర్‌ కుమార సంగక్కరను తెగ కాపీ కొట్టేదట. అతని ప్రతి బ్యాటింగ్‌ స్టైల్‌ను నకలు చేసేందుకు ఆమె ప్రయత్నించడంతో కోచ్‌ కొన్నిసార్లు తలంటాల్సి వచ్చిందట. 
 
ఈ విషయాన్ని ఆమె చిన్ననాటి కోచ్‌ అనంత్‌ తంబ్వేకర్‌ తెలిపారు. స్మృతికి చిన్నప్పుడే క్రికెట్‌ మీద ఇష్టం ఏర్పడింది. దీంతో తన సోదరులతో కలిసి ఆమె కూడా అనంత్‌ తంబ్వేకర్‌ కోచింగ్‌ అకాడమీలో చేరింది. 'స్మృతి చిన్నప్పటినుంచి చాలా హుషారుగా ఉండేది. అదేసమయంలో నెట్స్‌లో మాత్రం చాలా క్రమశిక్షణతో మెలిగేది. ఒక షాట్‌ ఆడటంలో కచ్చితత్వం సాధించేవరకు ఆమె నెట్స్‌ను వదిలిపెట్టేది కాదు. నెట్స్‌లో తను ఎప్పుడూ శ్రీలంక బ్యాట్స్‌మన్‌ సంగక్కరను కాపీ కొట్టడానికి ప్రయత్నించేది. దీంతో కొన్నిసార్లు నేను ఆమెను తిట్టేవాడిని. అలా కాపీ కొట్టడం సరికాదని చెప్పేవాడిని' అని అనంత్‌ తెలిపారు. 
 
20 ఏళ్ల స్మృతి వరల్డ్‌ కప్‌లో భాగంగా గత గురువారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో తన రెండో సెంచరీని సాధించిన సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలి.. లేకుంటే అనర్హత వేటు తప్పదు..

Karur Stampede: కరూర్ తొక్కిసలాట.. 41కి చేరిన మృతుల సంఖ్య

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

TVK Vijay: విజయ్ రాజకీయ భవిష్యత్తు ఏమౌతుందో?

Vijay: టీవీకే విజయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..? షారూఖ్ ఖాన్ తర్వాత ఆయనే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: చిన్నప్పుడు విన్న కథ తెరపై చూసినప్పుడు నాకు మాటలు రాలేదు : ఎన్టీఆర్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9- ప్రియాశెట్టి అవుట్

Chandrabose: చంద్రబోస్ పాట రక్తికట్టించారు, నా కళ్ళు చమర్చాయి : ఆర్.నారాయణమూర్తి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సత్యం మాట్లాడారు : ఆర్. నారాయణ మూర్తి

OG: హంగ్రీ చీటా పాటపాడిన సింగర్ ఆర్.ఆర్ ధృవన్ కు పవన్ అభినందనలు

తర్వాతి కథనం
Show comments