Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ మ్యాచ్‌లన్నీ యూఏఈకి తరలిపాయె... గత్యంతరం లేక అంగీకరించిన పాక్

ఠాగూర్
శుక్రవారం, 8 నవంబరు 2024 (12:03 IST)
వచ్చే యేడాది పాకిస్థాన్ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరుగనుంది. ఈ పోటీల నిర్వహణ హక్కులను దక్కించుకున్న పాకిస్థాన్‌..ఈ మ్యాచ్ నిర్వహణ కోసం తాత్కాలిక షెడ్యూల్‌ను ప్రకటించింది. ఇందులో వచ్చే యేడాది మార్చి ఒకటో తేదీన భారత్ - పాకిస్థాన్, మార్చి 9న లాహోర్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగాల్సివుంది. అయితే, భారత ప్రభుత్వం నుంచి అనుమతి వస్తేనే భారత్ క్రికెట్ జట్టు పాకిస్థాన్‌లో పర్యటిస్తుందని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బీసీసీఐ తేల్చి చెప్పింది. లేకపోతే ఈ టోర్నీకి భారత్ దూరంగా ఉంటుందని వెల్లడించింది. ఒక వేళ ఈ టోర్నీకి భారత్ రాకుంటే తీవ్రంగా నష్టపోతామని భావించిన పాకిస్థాన్.. తన వైఖరిని మార్చుకుంది. 
 
ఈ టోర్నీలో పాకిస్థాన్ పర్యటనకు భారత్ సర్కార్ అనుమతించకపోతే షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసేందుకు పిసీబీ సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. భారత్ ఆడే మ్యాచ్‌లను యూఏఈలోని దుబాయ్ లేదా షార్జాలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని పీసీబీ విశ్వసనీయ వర్గాలు తెలిపినట్లుగా పీటీఐ కథనంలో పేర్కొంది.
 
ఈ క్రమంలో టోర్నీని హైబ్రీడ్ విధానంలో వేరే దేశంలో నిర్వహించాల్సి వస్తే ఇబ్బందులు రాకుండా ఐసీసీ ముందుగానే అప్రమత్తమైంది. భారత జట్టు మ్యాచ్లు వేరే దేశంలో నిర్వహించాల్సిన పరిస్థితులు ఎదురైతే అందుకు అవసరమైన నిధులను టోర్నీ బడ్జెట్లో కేటాయించింది. 
 
గతంలో కూడా 2023 అసియా కప్ పాకిస్థాన్ వేదికగా జరగాల్సి ఉండగా, హైబ్రిడ్ విధానం అనుసరించి భారత్ మ్యాచ్‌లను శ్రీలంకలో నిర్వహించారు. ఇప్పుడు అదే మాదిరిగా యూఏఈలో మ్యాచ్ నిర్వహణకు పీసీబీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ నక్రాలు చేస్తే 10 మంది ఎంపీలను బీజేపీ లాగేస్తుంది : ప్రొఫెసర్ నాగేశ్వర్ (Video)

ఢిల్లీ హైకోర్టు జడ్జి నివాసంలో అగ్నిప్రమాదం.. మంటలు ఆర్పివేశాక బయటపడిన నోట్ల కట్టలు!!

Two headed snake: శివాలయంలో రెండు తలల పాము.. వీడియో వైరల్

దేశ, ప్రపంచ నగరాల్లో శ్రీవారి ఆలయాలు.. బాబు వుండగానే క్యూలైన్‌లో కొట్టుకున్న భక్తులు.. (Video)

Mother Thanks: చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన ఎసమ్మ అనే మహిళ.. ఎందుకు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gowtam: మహేష్ బాబు కుమారుడు గౌతమ్ నటుడిగా కసరత్తు చేస్తున్నాడు (video)

Sapthagiri: హీరో సప్తగిరి నటించిన పెళ్లి కాని ప్రసాద్ రివ్యూ

Dabidi Dibidi : ఐటమ్ సాంగ్‌లో ఓవర్ డ్యాన్స్.. హద్దుమీరితే దబిడి దిబిడే..

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

తర్వాతి కథనం
Show comments