Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ పోరు: భారత్-పాక్‌ మ్యాచ్‌కు జోరందుకున్న పందేలు.. రూ.2వేల కోట్ల వరకు?

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం జరుగనున్న ఫైనల్ పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దాయాదుల మధ్య జరిగే ఈ పోరు కోసం భారత్-పాక్ ప్రజలు, క్రికెట్ అభిమానులతో పాటు ప్రపంచ క్రికెట్ ఫ్యాన్స్ సైతం ఉత్సాహంగా ఎ

Webdunia
శనివారం, 17 జూన్ 2017 (13:21 IST)
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం జరుగనున్న ఫైనల్ పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దాయాదుల మధ్య జరిగే ఈ పోరు కోసం భారత్-పాక్ ప్రజలు, క్రికెట్ అభిమానులతో పాటు ప్రపంచ క్రికెట్ ఫ్యాన్స్ సైతం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ముంబై పేలుళ్లకు అనంతరం ఇరు దేశాల మధ్య క్రికెట్ సిరీస్‌లు చోటుచేసుకోని నేపథ్యంలో.. అంతర్జాతీయ వేదికపై ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ పోరులో దాయాదీ దేశాలు పోరుకు సై అంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ కోసం బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు.  
 
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌పై అంతర్జాలం వేదికగా రూ.2,000 కోట్ల విలువ మేర పందేలు జరుగుతున్నట్టు అఖిల భారత గేమింగ్ ఫెడరేషన్ (ఏఐజీఎఫ్) పేర్కొంది. ఎక్కువ మంది బుకీలు భారత్‌కు ఫేవర్‌గా ఉన్నారు. భారత్ ఏడాది పొడవునా ఆడే మ్యాచులపై సుమారు రూ.2లక్షల కోట్ల మేర పందేలు జరుగుతుంటాయని అఖిల భారత గేమింగ్ ఫెడరేషన్ సీఈవో రోలాండ్ ల్యాండర్స్ తెలిపారు. గత పదేళ్లలో భారత్-పాకిస్థాన్‌ల మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్ ఇదే కావడంతో బెట్టింగ్ జోరందుకుందని.. పందేలు తారాస్థాయిలో ఉన్నాయని ల్యాండర్స్ వివరించారు.  
అన్నీ చూడండి

తాజా వార్తలు

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

భర్త అక్రమ సంబంధం.. దంత మహిళా వైద్యురాలు ఆత్మహత్య ... ఎక్కడ?

పేర్ని నానీ నీకంత కొవ్వు పట్టిందా? వల్లభేని వంశీని గుర్తు చేసుకో : సోమిరెడ్డి

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

తర్వాతి కథనం
Show comments