Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాంపియన్స్ ట్రోఫీ : న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించిన బంగ్లాదేశ్

ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నుంచి న్యూజిలాండ్ జట్టు నిష్క్రమించింది. ఏమాత్రం అంచనాలు లేకుండా 'గ్రూప్ బి' నుంచి బరిలో దిగిన బంగ్లాదేశ్ జట్టు న్యూజిలాండ్‌కు ఊహించని షాకిచ్చింది.

Webdunia
శనివారం, 10 జూన్ 2017 (12:19 IST)
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నుంచి న్యూజిలాండ్ జట్టు నిష్క్రమించింది. ఏమాత్రం అంచనాలు లేకుండా 'గ్రూప్ బి' నుంచి బరిలో దిగిన బంగ్లాదేశ్ జట్టు న్యూజిలాండ్‌కు ఊహించని షాకిచ్చింది. ఫలితంగా కివీస్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. 
 
కార్డిఫ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో బంగ్లా కుర్రోళ్ళు అద్భుతంగా రాణించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్‌ను బంగ్లాదేశ్ బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. ఒక దశలో బలంగా కనిపించిన కివీస్‌ను కట్టడి చేసి 265 పరుగులకు పరిమితం చేశారు. కివీస్ ఆటగాళ్లలో విలియమ్సన్ (57), రాస్ టేలర్ (63) అర్ధసెంచరీలతో రాణించగా, గుప్టిల్ (33), బ్రూమ్ (36), నీషమ్ (23) ఆకట్టుకున్నారు. రోంచి (16), కోరె ఆండర్సన్ (0), మైల్ (7) విఫలమయ్యారు. శాంటనర్ (14), సౌతీ (10) చివర్లో నిలబడడంతో నిర్ణీత 50 ఓవర్లలో కివీస్ 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో మడ్ హాక్ మూడు వికెట్లతో రాణించగా, రెండు వికెట్లతో టస్కిన్ అహ్మద్ ఆకట్టుకున్నాడు. 
 
ఆ తర్వాత 266 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్‌కు కివీస్ బౌలర్లు ఆదిలో చుక్కలు చూపించారు. తమీమ్ ఇక్బాల్ (0), సౌమ్యా సర్కార్ (3), సబ్బీర్ రెహ్మాన్ (8)ను టిమ్ సౌతీ పెవిలియన్‌కు పంపడంతో బంగ్లా జట్టు కనీసం 150 పరుగులైనా చేస్తుందా? అన్న అనుమానం వచ్చింది. ముష్ఫికర్ (14) కూడా అవుట్ కావడంతో ఆన్‌లైన్‌లో అభిమానుల ఓటింగ్ కూడా బంగ్లా ఓటమి ఖాయమని తేల్చేశారు. కానీ క్రీజులోకి వచ్చిన షకిబల్ హసన్ (114), మహ్మదుల్లా (105) అద్భుతంగా ఆడి తిరుగులేని విజయం అందించిపెట్టారు. ఆరంభంలో నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించిన షకిబల్, మహ్మదుల్లా వేగం పెంచి, నిలకడగా ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించి 5 వికెట్ల తేడాతో విజయం సాధించారు.
 
అయితే, ఈ మ్యాచ్‌లో విజయం సాధించినప్పటికీ బంగ్లాదేశ్ సెమీస్ బెర్త్ ఇంకా ఖరారు కాలేదు. శనివారం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మ్యాచ్ ఫలితంపై ఈ జట్టు సెమీస్ బెర్త్ ఖరారు కానుంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓడితే... బంగ్లాదేశ్ సెమీఫైనల్‌కు చేరుతుంది. ఆ మ్యాచ్‌లో ఆసీస్ గెలిస్తే బంగ్లా ఇంటికి చేరుతుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్ సైన్యంలో తిరుగుబాటు : ఆర్మీ చీఫ్‌కి జూనియర్ల వార్నింగ్

తిరుపతిలో వ్యర్థాలను ఏరుకునే వారి కోసం ట్రాన్స్‌ఫర్మేటివ్ ప్రాజెక్ట్

Praveen Kumar: పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మరణానికి ఏంటి కారణం?

Bhadrachalam: భద్రాచలంలో ఆరు అంతస్థుల భవనం కుప్పకూలింది: శిథిలాల కింద ఎంతమంది? (video)

పాస్‌పోర్ట్ మరిచిపోయిన పైలెట్... 2 గంటల జర్నీ తర్వాత విమానం వెనక్కి!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

తర్వాతి కథనం
Show comments