Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇరు జట్లను ఊరిస్తున్న ఓవెల్ టెస్ట్ మ్యాచ్ ఫలితం

Webdunia
సోమవారం, 6 సెప్టెంబరు 2021 (16:08 IST)
భారత్ ఇంగ్లండ్ జట్ల మధ్య ఓవెల్ వేదికగా నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం ఇరు జట్లనూ ఊరిస్తుంది. ఆతిథ్య ఇంగ్లండ్ ముంగిట 368 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. ప్రస్తుతం విజయానికి మరో 291 పరుగుల దూరంలో ఉంది. అదేసమయంలో టీమిండియా గెలవాలంటే చివరి రోజు పది వికెట్లు తీయాల్సిన పరిస్థితి ఏర్పడంది. ఈ నేపథ్యంలో చివరి రోజు ఆట థ్రిల్లర్‌ను తలపించడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
 
ఇదిలావుంటే, ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే మాత్రం 50 ఏళ్ల నిరీక్షణకు తెరపడుతుంది. ఓవల్‌లో భారత్ గత 50 ఏళ్లుగా ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేదు. ఈ మైదానంలో భారత్ చివరి సారిగా 1971లో గెలిచింది. ఆ మ్యాచ్‌లో అజిత్ వాడేకర్ సారథ్యంలోని భారత జట్టు ఆతిథ్య జట్టును 4 వికెట్ల తేడాతో ఓడించింది. అదే ఈ మైదానంలో భారత్ అందుకున్న చివరి విజయం.
 
ఆ తర్వాత టీమిండియా 8 మ్యాచ్‌లు ఆడిన ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించలేకపోయింది. వరుసగా గత మూడు పర్యటనల్లో(2011, 2014, 2018) భారత్ ఘోర పరాజయాలను చవిచూసింది. 2011లో ఇన్నింగ్స్, 8 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా.. 2014 టూర్‌లో ఇన్నింగ్స్ 244 రన్స్‌తో చిత్తయింది. 2018 పర్యటనలో 118 రన్స్ తేడాతో ఓటమిపాలైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

పెద్దిరెడ్డి పక్కకుపోతే.. పవన్‌తో చేతులు కలిపిన బొత్స -వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

తర్వాతి కథనం
Show comments